2018-19 ఆర్థిక సంవత్సరానికి జీఎస్టీ వార్షిక రిటర్ను, ఆడిట్ నివేదిక దాఖలు చేసేందుకు గడువు పొడిగించింది ప్రభుత్వం.
"ఎన్నికల నియమావళి నేపథ్యంలో ఎన్నికల కమిషన్ నుంచి అనుమతులు తీసుకున్న తర్వాతే గడువు తేదీలను నిర్ణయించింది ప్రభుత్వం. జీఎస్టీఆర్-9, జీఎస్టీఆర్-9(సీ).. వార్షిక రిటర్నులను సమర్పించేందుకు సెప్టెంబర్ 30గా ఉన్న చివరి తేదీని అక్టోబర్ 31కి పొడిగించాం."
-కేంద్ర పరోక్ష పన్నులు, సుంకాల బోర్డు (సీబీఐసీ)
కరోనా నేపథ్యంలో మే నెలలో.. 2018-19 జీఎస్టీ రిటర్ను దాఖలు చేసేందుకు మూడు నెలలు (సెప్టెంబర్ 30 వరకు) గడువు పొడిగించడం గమనార్హం.
ఐటీఆర్‌కు పెరిగిన గడువు..
2018-19 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆదాయపు పన్ను రిటర్ను సమర్పించేందుకు.. మరో రెండు నెలలు గడువు పొడిగిచింది ఆదాయపు పన్ను విభాగం(ఐటీ). సెప్టెంబర్ 30 వరకు ఆదాయపు పన్ను రిటర్ను సమర్పించేందుకు వీలు కల్పిస్తున్నట్లు బుధవారం ప్రకటించింది.
కరోనా పరిస్థితుల నేపథ్యంలో 2019-20 మదింపు సంవత్సరానికి.. ఆలస్య రిటర్ను, సవరణలతో కూడిన రిటర్ను దాఖలుకు గడువును పెంచింది. నవంబర్ 30 వరకు ఈ అవకాశం ఉంటుందని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు పేర్కొంది. కరోనా కారణంగా ఐటీఆర్ దాఖలుకు గడువు పొడగించడం ఇది నాలుగోసారి.
ఇదీ చూడండి:మీడియా, వినోద రంగానికి 2021-22లో కొత్త కళ!