దేశంలో ఉల్లి ధరల అదుపునకు కేంద్రం చర్యలు ముమ్మరం చేసింది. ఉల్లిపాయల ఎగుమతిపై నిషేధం విధించింది. తక్షణమే ఈ ఆంక్షలు అమలులోకి వస్తాయని తెలిపింది.
అన్ని రకాల ఉల్లి ఎగుమతులపై నిషేధం అమలులోకి వచ్చిందని.. ప్రభుత్వం నుంచి తదుపరి ఆదేశాలు అందే వరకు ఎలాంటి ఎగుమతులు నిర్వహించరాదని విదేశీ వాణిజ్య డైరెక్టరేట్ జనరల్ స్పష్టం చేసింది.
ధరలు ఎందుకు పెరిగాయంటే..
ఉల్లి ఎక్కువగా పండే మహారాష్ట్రలో కురిసిన భారీ వర్షాల కారణంగా సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఫలితంగా దిల్లీ తదితర ప్రాంతాల రిటైల్ మార్కెట్లలో లభ్యత తగ్గి.. ఇటీవల కిలో ఉల్లి ధర రూ.60-80 దాటింది.
ఈ నేపథ్యంలో ధరలు తగ్గించాలని సామాన్యుల నుంచి డిమాండు పెరిగింది. విపణిలో లభ్యత పెంచేందుకు.. 50 టన్నుల సరుకును మార్కెట్లోకి విడుదల చేసింది కేంద్రం.
ఇదీ చూడండి: జియో ఫైబర్లోని ఈ రహస్య ఫీచర్లు తెలుసా...?