కరోనా సంక్షోభం నేపథ్యంలో పన్ను చెల్లింపుదారులకు కేంద్రం ఊరట కల్పించింది. ఎదైనా సంస్థ తమ ఉద్యోగికి లేదా ఎవరైన వ్యక్తి మరొకరికి.. కరోనా వైద్యానికి చెల్లింపులు జరిపితే.. 2019-2020 సహా తర్వాతి ఏడాదికి కూడా.. ఆ ఉద్యోగికి లేదా లబ్ధిదారునికి పన్ను మినహాయింపు ఇస్తున్నట్లు ప్రకటించింది.
ఎవరైనా ఉద్యోగి కరోనాతో మరణిస్తే వారి కుటుంబానికి సంస్థ చెల్లించే పరిహారంపై కుడా పన్ను మినహాయింపు ఇస్తున్నట్లు ఆర్థిక శాఖ వెల్లడించింది. అయితే రూ.10 లక్షలలోపు పరిహారం పొందే వారికి మాత్రమే ఇది వర్తిస్తుందని స్పష్టం చేసింది.
ఇదీ చదవండి:పాన్- ఆధార్ లింక్ గడువు 3 నెలలు పొడిగింపు