ETV Bharat / business

2021లో పెరిగిన ప్రభుత్వ వ్యయం! - ప్రభుత్వ పెట్టుబడులు

గత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ వ్యయం రెండు శాతం పెరిగినట్లు ఓ నివేదిక వెల్లడించింది. భారత వృద్ధిరేటు 7.3శాతం కుంగినప్పటికీ.. ప్రభుత్వ వ్యయం మాత్రం పెరగడం విశేషమని అభిప్రాయపడింది. మరోవైపు ప్రైవేటు రంగ వ్యయం 10 శాతం తగ్గినట్లు తెలిపింది.

government spending
ప్రభుత్వ ఖర్చులు
author img

By

Published : Jul 4, 2021, 5:30 AM IST

గత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ వ్యయం రెండు శాతం పెరిగినట్లు మోతీలాల్‌ ఓస్వాల్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ (ఎంఓఎఫ్‌ఎస్‌ఎల్‌) వెల్లడించింది. భారత వృద్ధిరేటు 7.3శాతం కుంగినప్పటికీ.. ప్రభుత్వ వ్యయం మాత్రం పెరగడం విశేషమని అభిప్రాయపడింది. మరోవైపు ప్రైవేటు రంగ వ్యయం 10శాతం తగ్గినట్లు వెల్లడించింది. దీంతో జీడీపీలో ప్రైవేటు రంగ వాటా 8.7 పర్సంటేజీ పాయింట్లు తగ్గగా.. ప్రభుత్వ వాటా 0.33 పర్సంటేజీ పాయింట్లు పెరిగినట్లు పేర్కొంది.

ప్రభుత్వ పెట్టుబడులు వరుసగా రెండో ఏడాదీ తగ్గుముఖం పట్టినట్లు ఎంఓఎఫ్‌ఎస్‌ఎల్‌ తెలిపింది. ఆర్థిక లోటు 13.3శాతం తగ్గి మూడు దశాబ్దాల కనిష్ఠానికి చేరినట్లు వెల్లడించింది. ఇక గత నాలుగు సంవత్సరాల్లో మూడు సార్లు 6.3శాతం చొప్పున కుంగిన రాష్ట్ర ప్రభుత్వాల ఆర్థిక వ్యయాలు ఈసారి ఏకంగా 5.8శాతం పెరిగినట్లు పేర్కొంది. మరోవైపు రాష్ట్రాల ఆర్థిక లోటు 17 సంవత్సరాల కనిష్ఠానికి చేరినట్లు తెలిపింది.

ఇదీ చూడండి: 2021-22లో రెండంకెల వృద్ధి రేటు కష్టమే!

ఇదీ చూడండి: ఆర్థిక వృద్ధిపై కరోనా పోటు- పునరుజ్జీవమెలా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.