బంగారం ధర బుధవారం కాస్త పెరిగింది. దేశ రాజధాని దిల్లీలో 10గ్రాముల పసిడి ధర రూ.45 పెరిగి 48,273 వద్దకు చేరింది.
వెండి ధర కిలోకు రూ.407 పెరిగింది. ప్రస్తుతం కిలో వెండి ధర రూ.59,380గా ఉంది.
అంతర్జాతీయ మార్కెట్లోనూ ఔన్సు బంగారం ధర 1,812 డాలర్లకు పెరిగింది. వెండి ధర సైతం పెరిగి ఔన్సుకు 23.34 డాలర్ల వద్ద ఉంది.
కరోనా వ్యాక్సిన్ సత్ఫలితాలు , జో బైడెన్ శ్వేత సౌధంలోకి అడుగుపెట్టేందుకు మార్గం సుగమం తదితర అంశాలతో పసిడి రేట్లు పెరిగినట్లు హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ సీనియర్ అనలిస్ట్ తపన్ పటేల్ తెలిపారు.
ఇదీ చదవండి :'గూగుల్ పే' యూజర్లకు గుడ్న్యూస్