ప్రపంచదేశాల రుణాలు.. ప్రపంచ జీడీపీతో పోల్చితే రికార్డుస్థాయిలో అధికంగా ఉన్నాయని ఎస్&పీ గ్లోబల్ రేటింగ్స్ తెలిపింది. అయితే కరోనా నుంచి క్రమంగా కోలుకుంటున్న ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఇలానే పరుగులు పెడితే.. ఈ సంక్లిష్ట స్థితి నుంచి ఏ క్షణమైన బయటపడగలదని ఆశాభావం వ్యక్తం చేసింది.
జీడీపీతో పోల్చితే ప్రపంచ రుణం ఎప్పటి నుంచో పెరుగుతూ పోతోందని.. అయితే కరోనా కారణంగా అది ఇంకాస్త ఎక్కువ ఎత్తులకు ఎగబాకిందని చెప్పింది. గతేడాది చివరకు ప్రపంచ మొత్తం రుణం 267 ట్రిలియన్ డాలర్లుగా ఉండగా అది జీడీపీలో 267 శాతమని వివరించింది. అయితే ఈ ఏడాది ముగిసే నాటికి 258 శాతానికి దిగి వస్తుందని.. 2022-23 ఆర్థిక సంవత్సరం చివరకు 255 లేదా 256 శాతంగా ఉంటుందని ఎస్&పీ చెప్పింది.
అటు ప్రపంచ జీడీపీ వాస్తవ వృద్ధి రేటు 2021లో 5శాతంగా ఉంటుందని అంచనా వేసింది ఎస్&పీ. అయితే 2022లో 4 శాతానికి, 2023లో 3.6 శాతానికి తగ్గొచ్చని వివరించింది.
ఇదీ చదవండి:చమురు మంట.. ఆరేదెట్టా?