కరోనా మహమ్మారి మొదటి దశ విజృంభణ కారణంగా భారత్లో 80 శాతం ఆదాయ నష్టం ప్రైవేటు రంగంలోనే సంభవించినట్లు ఓ నివేదిక తెలిపింది. ఇదే సమయంలో ఇతర దేశాల్లో ఆదాయ నష్టం అధికంగా ప్రభుత్వంపై పడినట్లు పేర్కొంది.
కరోనాతో దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థను ఆదుకునేందుకు గత ఏడాది రూ.21 లక్షల కోట్ల ప్యాకేజీని ప్రకటించింది కేంద్రం. దేశ జీడీపీలో 10 శాతానికి ఇది సమానమని పేర్కొంది. అయితే నిజానికి కరోనా ఉపశమనం లభించింది జీడీపీలో 2 శాతం మాత్రమేనని నివేదిక స్పష్టం చేసింది. మిగతా సాయాన్ని ప్రభుత్వం రుణాల రూపంలో అందించినట్లు వివరించింది.
ఆ దేశాల్లో ప్రభుత్వ నష్టాలే అధికం..
ఆస్ట్రేలియా, కెనడా, అమెరికా వంటి దేశాల్లో మాత్రం పరిస్థితులు ఇందుకు పూర్తి భిన్నంగా ఉన్నట్లు మోతీలాల్ ఓస్వాల్ ఫినాన్షియల్ సర్వీసెస్ పరిశోధకకులు నికిల్ గుప్త, యశ్వీ అగర్వాల్ తెలిపారు. ఆయా దేశాల్లో ప్రభుత్వ రంగ సంస్థలు భారీ నష్టాలను చవి చూడగా.. ప్రైవేటు రంగానికి మాత్రం ఉపశమనం కల్పించినట్లు వెల్లడించారు.
ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, స్పెయిన్, బ్రిటన్ వంటి దేశాల్లో మాత్రం ప్రైవేటు రంగ నష్టం 20 నుంచి 60 శాతం మధ్య ఉన్నట్లు నివేదిక తెలిపింది.
ఆదాయ నష్టాలు ఇలా..
ప్రభుత్వ ఆదాయాల నష్టం గత ఏడాది.. భారత్లో అత్యల్పంగా 20 శాతం ఉన్నట్లు నివేదిక పేర్కొంది. అమెరికా, కెనాడాల్లో ఇది 100 శాతంగా, ఆస్ట్రేలియాలో ఏకంగా 200 శాతంగా ఉన్నట్లు వెల్లడించింది.
'అభివృద్ధి చెందుతున్న దేశాల్లో దక్షిణాఫ్రికాలో మాత్రమే ప్రభుత్వ పూర్తి ఆదాయ నష్టాన్ని చవి చూసింది. ప్రైవేటు రంగ ఆదాయం దాదాపు స్థిరంగా ఉంది' అని నివేదిక వివరించరింది.
ఇవీ చదవండి: