ETV Bharat / business

'వచ్చే త్రైమాసికంలో మంచి వృద్ధిరేటు సాధిస్తాం' - జీడీపీపై నిర్మలా సీతారామన్​ వ్యాఖ్యలు

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధి రేటు సున్నాకు దగ్గరగా ఉంటుందని అంచనా వేశారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​. అయితే దేశ ఆర్థిక వ్యవస్థ ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్న సంకేతాలు కనిపిస్తున్నాయన్నారు.

FM sees GDP growth in negative zone or near zero in current fiscal
'సున్నాకు చేరువుగా దేశ ఆర్థికవ్యవస్థ'
author img

By

Published : Oct 27, 2020, 7:08 PM IST

కరోనా లాక్​డౌన్​ కారణంగా తీవ్రంగా దెబ్బతిన్న దేశ ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం పుంజుకుంటుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​ అన్నారు. ఈ ఆర్థిక సంవత్సరానికి జీడీపీ వృద్ధిరేటు మైనస్​ లేదా సున్నాకు దగ్గరగా ఉండొచ్చని అంచనా వేశారు. మొదటి త్రైమాసికంలో (ఏప్రిల్-జూన్) ఏర్పడిన 23.9 శాతం లోటే ఇందుకు కారణమని తెలిపారు. ఈ మేరకు దిల్లీలోని ఇండియా ఎనర్జీ ఫోరం 'సెరా వీక్​' (సీఈఆర్​ఏడబ్ల్యూఈఈకే) లో మాట్లాడారు.

కరోనా మహమ్మారిని అదుపుచేయడంలో కఠిన నిర్ణయం తీసుకోవాల్సివచ్చింది. దాని పర్యవసానంగా మొదటి త్రైమాసికంలో 23.9శాతం లోటు ఏర్పడింది. ప్రస్తుతం స్థూల దేశీయోత్పత్తి సూచీలు ఆశాజనకంగా ఉన్నాయి. పండుగ సీజన్​ల కారణంగా ఆర్థిక వ్యవస్థ కోలుకుంటుంది. మూడు, నాలుగవ త్రైమాసికాల ఫలితాలు సానుకూలంగా ఉంటాయని ఆశిస్తున్నాం. ఆర్థిక కార్యకలాపాలను, ప్రజల కొనుగోలు స్థాయిని పెంచే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది.

-నిర్మలా సీతారామన్, కేంద్ర ఆర్థిక మంత్రి

ఇదీ చూడండి: చక్రవడ్డీ మాఫీ పథకాన్ని అమలు చేయండి: ఆర్​బీఐ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.