ETV Bharat / business

'బ్యాంక్​ అకౌంట్లకు ఆధార్​ అనుసంధానం తప్పనిసరి' - rupay cards news

ఈ ఆర్థిక సంవత్సరం ముగింపు నాటికి బ్యాంక్​ అకౌంట్లకు తప్పనిసరిగా ఆధార్​ నంబర్​ను​ అనుసంధానం చేయాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​ సూచించారు. ఆర్థిక లావాదేవీలకు సంబంధించి ఆన్​లైన్​ పేమెంట్స్​కు అధిక ప్రాధాన్యం ఇవ్వాలన్నారు.

FM asks banks to ensure all accounts are linked with Aadhaar by March next year
'బ్యాంక్​ అకౌంట్లకు ఆధార్​ అనుసంధానం తప్పనిసరి'
author img

By

Published : Nov 10, 2020, 7:52 PM IST

వచ్చే ఏడాది మార్చి 31 నాటికి దేశంలో ప్రతి ఒక్కరి బ్యాంక్​ ఖాతాలను ఆధార్​తో అనుసంధానం చేయాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతా రామన్​ బ్యాంకులను ఆదేశించారు. ఇప్పటికీ అనుసంధానం కాని ఖాతాలు చాలానే ఉన్నాయని గుర్తు చేశారు. ఇండియన్​ బ్యాంక్స్​ అసోసియేషన్​(ఐబీఏ) 73వ జనరల్​ మీటింగ్​లో పాల్గొన్న ఆమె బ్యాంక్​లకు దిశానిర్దేశం చేశారు.

అన్నీ బ్యాంక్​ ఖాతాలకు ఆధార్​ అనుసంధానం జరగాలి. ఈ ప్రక్రియ మార్చి 21, 2021నాటికి పూర్తి కావాలి. నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించాలి. ఇందుకు యూపీఐ పేమెంట్స్​పై అవగాహన కల్పించాలి. వీటితో పాటు దేశీయ 'రూపే' కార్డులను ప్రజలకు అందించాలి. కార్డు అవసరమైన ప్రతీ ఒక్కరికి రూపే కార్డులు మాత్రమే ఇవ్వాలి.

-నిర్మలా సీతా రామన్​, కేంద్ర ఆర్థిక మంత్రి

ఇదీ చూడండి: మ్యూచువల్ ఫండ్స్​లో స్మార్ట్ సిప్ గురించి తెలుసా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.