కరోనాతో దేశవ్యాప్త లాక్‌డౌన్ కొనసాగుతున్న వేళ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించారు. పేదలు, గ్రామీణులను దృష్టిలో ఉంచుకుని 'ప్రధాన్ మంత్రి గరీబ్ కల్యాణ్ యోజన' పేరుతో రూ.1.70 లక్షల కోట్ల ప్యాకేజీని తీసుకువచ్చారు.
కరోనాపై పోరాటం చేస్తున్న శానిటేషన్, ఆశా వర్కర్లు, పారామెడికల్, వైద్యులు, నర్సులకు ఒక్కొక్కరికి రూ.50 లక్షల చొప్పున ప్రత్యేక బీమా సదుపాయం కల్పిస్తున్నట్లు తెలిపారు ఆర్థిక మంత్రి.
దేశవ్యాప్తంగా 21 రోజుల లాక్‌డౌన్ పరిస్థితులను అంచనా వేసి.. అందుకు అనుగుణంగా ఈ ప్యాకేజీని రూపొందించినట్లు స్పష్టం చేశారు.