ETV Bharat / business

నవ భారత​ నిర్మాణమే లక్ష్యంగా ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ - నిర్మలా సీతారామన్​ వార్తలు

Union Finance Minister Nirmala Sitharaman is likely to give the details regarding which sectors and areas will be given how much amount and how it will be used on Wednesday.

nirmala
నిర్మల
author img

By

Published : May 13, 2020, 3:56 PM IST

Updated : May 13, 2020, 5:48 PM IST

17:29 May 13

కరోనాతో స్తంభించిన ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడినపెట్టి, పేదలు, మధ్యతరగతి ప్రజల జీవనోపాధిని కాపాడేలా కేంద్రం కీలక చర్యలకు ఉపక్రమించింది. ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన ఆత్మ నిర్భర భారత్​ అభియాన్​ తొలి దశలో భాగంగా 15 ఉద్దీపన చర్యల వివరాల్ని వెల్లడించారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. ఇందులో 6 నిర్ణయాలు... లక్షలాది మందికి ఉపాధి కల్పించే సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు సంబంధించినవే.

కరోనా కారణంగా మూతపడ్డ చిన్న, మధ్య తరహా పరిశ్రమలను సత్వరమే తిరిగి తెరిచి, లక్షలాది మంది జీవనోపాధిని కాపాడేందుకు ఈ నిర్ణయాలు ఉపకరిస్తాయని తెలిపారు నిర్మల.

ఎంఎస్​ఎంఈల కోసం 6 చర్యలు

  1. సూక్ష్మ, చిన్న, మధ్య స్థాయి పరిశ్రమలకు భారీగా రుణాలు ఇవ్వనున్నట్లు నిర్మల తెలిపారు. ఎలాంటి పూచీకత్తు లేకుండా రూ.3 లక్షల కోట్లను వాటికి కేటాయించినట్లు స్పష్టం చేశారు. నాలుగేళ్ల పరిమితితో లభించే ఈ రుణాలకు 12 నెలల మారటోరియం వర్తిస్తుందని పేర్కొన్నారు. దీని ద్వారా 45 లక్షల యూనిట్లకు లబ్ధి కలుగుతుందని చెప్పారు. 2020 అక్టోబర్​ 31 వరకు ఈ పథకం అందుబాటులో ఉంటుందని తెలిపారు.
  2. ఆర్థిక కష్టాల్లో ఉన్న సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమలను ఆదుకునేందుకు 20 కోట్ల సబ్​ ఆర్డినేట్ రుణ సౌకర్యం కల్పించనున్నట్లు నిర్మల తెలిపారు. ప్రభుత్వం తరపున నాలుగు వేల కోట్ల రూపాయలను అందించనున్నట్లు స్పష్టం చేశారు.
  3. పెట్టుబడి సమస్యలతో సతమతమవుతున్న పరిశ్రమల్లోకి రూ.50 వేల కోట్ల ఈక్విటీని చొప్పించనున్నట్లు ప్రకటించారు నిర్మల. రూ.10 వేల కోట్లతో ఫండ్ ఆఫ్​ ఫండ్స్​ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ప్రస్తుత కరోనా సంక్షోభం కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిశ్రమలకు దీని ద్వారా ప్రయోజనం కలుగుతుందని అన్నారు. ప్రధాన స్టాక్ ఎక్స్ఛేంజీలలో ఎంఎస్​ఎంఈలు నమోదయ్యేలా సహకరిస్తామని హామీ ఇచ్చారు.
  4. ఎంఎస్​ఎంఈల నిర్వచనంలో మార్పులు చేయనున్నట్లు ప్రకటించారు ఆర్థిక మంత్రి. పరిశ్రమల పెట్టుబడి పరిమితిని పెంచారు. ఇదివరకు 25 లక్షల పెట్టుబడి పెట్టే తయారీ రంగ పరిశ్రమను ఎంఎస్​ఎంఈగా పరిగణించగా.. ఈ పరిమితిని కోటికి పెంచారు. సేవారంగంలో ఉన్న పరిమితిని 10 లక్షల నుంచి కోటికి పెంచినట్లు తెలిపారు.
  5. విదేశీ కంపెనీల నుంచి తీవ్ర పోటీ ఎదుర్కొంటున్న ఎంఎస్​ఎంఈలకు వ్యాపార అవకాశాలు మరింత మెరుగుపర్చనున్నట్లు నిర్మల స్పష్టం చేశారు. ప్రభుత్వ ప్రాజెక్టులకు సంబంధించిన టెండర్లలో ఎమ్​ఎస్​ఎమ్​ఈలు పాల్గొనలేని పరిస్థితి ఉందని అన్నారు. అందువల్ల రూ.200 కోట్ల కన్నా తక్కువ విలువైన ప్రాజెక్టుల్లో విదేశీ టెండర్లకు అనుమతి నిరాకరిస్తున్నట్లు తెలిపారు.
  6. కరోనా తర్వాత ట్రేడ్​ ఫెయిర్స్ నిర్వహణ కష్టమని.. ఈ నేపథ్యంలో ఈ-మార్కెట్ ద్వారా అన్ని ఎమ్​ఎస్​ఎమ్​ఈలను అనుసంధానం చేయనున్నట్లు ఆర్థిక మంత్రి తెలిపారు. ట్రేడ్​ ఫెయిర్స్​లో పాల్గొనలేకపోయినా ఎమ్​ఎస్​ఎమ్​ఈలు మార్కెట్​ను గుర్తించి, వ్యాపారం అభివృద్ధి చేసుకునే అవకాశం ఉంటుందని చెప్పారు.

17:22 May 13

కరోనాతో తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిన చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు ఎలాంటి పూచీకత్తు లేకుండా రూ.3లక్షల కోట్లు రుణాలుగా ఇవ్వనున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. కరోనా సంక్షోభంతో కుదేలైన దేశ ఆర్థిక వ్యవస్థకు పునరుజ్జీవం పోసేలా ప్రధాని మోదీ ప్రకటించిన రూ.20 లక్షల కోట్ల భారీ ఆర్థిక ప్యాకేజీ వివరాలను ఆమె వెల్లడించారు.  

  1. ఈ ఆర్థిక ప్యాకేజీలో భాగంగా 15 అంశాల్లో కేటాయింపులు.
  2. ఎంఎస్‌ఎంఈలకు ఆరు అంశాల్లో ఆర్థిక ప్యాకేజీతో ప్రయోజనం.
  3. సూక్ష్మ, మధ్య, లఘు, కుటీర పరిశ్రమల(ఎంఎస్‌ఎంఈ)కు ఎలాంటి పూచీకత్తు లేకుండా రూ.3లక్షల కోట్ల రుణాలు.
  4. 12 నెలల మారటోరియంతో ఈ రుణాలు మంజూరు.
  5. ఉత్పత్తి సామర్థ్యాల పెంపు కోసం రూ.10వేల కోట్లతో ఫండ్‌ ఏర్పాటు.
  6. తీవ్రమైన రుణ ఒత్తిడిలో ఉన్న ఎంఎస్‌ఎంఈలకు రూ.20వేల కోట్లు.
  7. ఎంఎస్‌ఎంఈల్లో ఈక్విటీ పెట్టుబడుల కోసం రూ.50వేల కోట్లు కేటాయింపు.
  8. ఈ ప్యాకేజీతో రెండు లక్షల చిన్న తరహా పరిశ్రమలకు ప్రయోజనం కలగనుంది.
  9. ఈపీఎఫ్‌ పరిధిలోకి వచ్చే ఎంఎస్‌ఎంఈలకు మరో మూడు నెలలు ప్రభుత్వమే భవిష్య నిది (పీఎఫ్‌) చెల్లిస్తుంది.
  10. జూన్‌, జులై, ఆగస్టు నెలల పీఎఫ్‌ మొత్తం  రూ.2500 కోట్లు కేంద్ర ప్రభుత్వమే ఇస్తుంది.
  11. ప్రస్తుతం ఉన్న టీడీఎస్, టీసీఎస్ రేట్లు 25% తగ్గింపు.
  12. రేపటి నుంచి 2021 మార్చి 31వరకు టీడీఎస్‌, టీసీఎస్‌ రేట్లు తగ్గింపు అమల్లో ఉంటుంది.
  13. ఈ వెసులుబాటు వల్ల ప్రజలకు సుమారు రూ.50వేల కోట్లు ప్రయోజనం.

17:13 May 13

  • ప్రత్యక్ష పన్ను చెల్లింపుదారులకు ఊరట: నిర్మలా సీతారామన్‌
  • ప్రస్తుతం చెల్లిస్తున్న టీడీఎస్‌ నుంచి 25 శాతం మినహాయింపు: నిర్మలా సీతారామన్‌
  • 25 శాతం తగ్గింపుతో ప్రజలకు రూ.50 వేల కోట్ల మేర లబ్ధి: నిర్మలా సీతారామన్‌

16:53 May 13

ఈపీఎఫ్​

  • ఈపీఎఫ్​ ప్రయోజనాలు మరో 3 నెలలు పొడిగింపు.
  • యాజమాన్యాలు, ఉద్యోగుల పీఎఫ్​ వాటా రూ.2500 కోట్లు ప్రభుత్వమే చెల్లిస్తుంది.
  • జూన్​, జులై, ఆగస్టు నెలలకు గాను 72.22 లక్షల ఉద్యోగులకు లబ్ధి.
  • ఉద్యోగుల టేక్ హోమ్​ సేలరీ పెంచేలా చర్యలు.
  • పీఎఫ్​ కంట్రిబ్యూషన్​ 12 శాతం నుంచి 10 శాతానికి తగ్గింపు.

16:44 May 13

  • ఎంఎస్‌ఎంఈలకు మేలు చేసేలా కొత్త నిర్వచనం.
  • టర్నోవర్‌ పెరిగినా ఎంఎస్‌ఎంఈ పరిధి నుంచి బయటకు వెళ్లరు.
  • ఎంఎస్‌ఎంఈల పెట్టుబడి పరిమితిని గణనీయంగా పెంపు.
  • పెద్దమొత్తంలో పెట్టుబడులు వచ్చినా ఎంఎస్‌ఎంఈ పరిధిలోనే.
  • రూ.25 లక్షలు పెట్టుబడి సూక్ష్మ పరిశ్రమల పరిధిని రూ.కోటికి పెంపు.
  • రూ.5 కోట్ల టర్నోవర్‌ చేసే కంపెనీలు కూడా సూక్ష్మ పరిశ్రమలుగా గుర్తింపు.

16:36 May 13

ప్యాకేజీ వివరాలు

  • తీవ్రమైన రుణ ఒత్తిడిలో ఉన్న ఎంఎస్‌ఎంఈలకు రూ.20 వేల కోట్లు
  • ప్యాకేజీతో రెండు లక్షల చిన్న తరహా పరిశ్రమలకు ప్రయోజనం
  • ఎన్‌పీఏ ముప్పు ఎదుర్కొంటున్న ఏ ఎంఎస్‌ఎంఈ అయినా ఈ సదుపాయం ఉపయోగించుకోవచ్చు
  • ఎంఎస్‌ఎంఈల్లో ఈక్విటీ పెట్టుబడుల కోసం రూ.50 వేల కోట్లు
  • ఉత్పత్తి సామర్థ్యాల పెంపు కోసం రూ.10 వేల కోట్లతో ఫండ్‌ ఆఫ్ ఫండ్
  • శక్తి, సామర్థ్యం ఉన్న ఏ ఎంఎస్‌ఎంఈ అయినా ఈ సదుపాయం ఉపయోగించు కోవచ్చు
  • ఎంఎస్‌ఎంఈల నిర్వచనంపై కొంత అయోమయం ఉంది
  • ఇప్పుడు ఎంఎస్‌ఎంఈలకు మేలు చేసేలా కొత్త నిర్వచనం ఇస్తున్నాం
  • టర్నోవర్‌ పెరిగినా ఎంఎస్‌ఎంఈ పరిధి నుంచి బయటకు వెళ్లరు
  • ఎంఎస్‌ఎంఈల పెట్టుబడి పరిమితిని గణనీయంగా పెంచుతున్నాం

16:28 May 13

  • ఆర్థిక ప్యాకేజీలో భాగంగా మొత్తం 15 చర్యలు.
  • ఎంఎస్‌ఎంఈలకు ఆరు అంశాల్లో ఆర్ధిక ప్యాకేజీతో ప్రయోజనం.
  • ఎంఎస్‌ఎంఈలకు సంబంధించి రూ. మూడు లక్షల కోట్లు కేటాయింపు.
  • పూచీకత్తు లేకుండా, 12 నెలల మారటోరియంతో రుణాలు.
  • అంటే 12 నెలల వరకు రుణాలపై ఎలాంటి తిరిగి చెల్లింపులు చేయక్కరలేదు.
  • ఎంఎస్‌ఎంఈల్లో ఉద్యోగులకు భద్రత కల్పించడానికీ ఈ ప్యాకేజీ ఉపయోగపడుతుందని నిర్మలా సీతారమన్‌ చెప్పారు.

16:27 May 13

  • ఆర్థిక ప్యాకేజీలో భాగంగా 15 అంశాల్లో కేటాయింపులు: నిర్మలా సీతారామన్‌
  • ఎంఎస్‌ఎంఈలకు సంబంధించి రూ.3 లక్షల కోట్లు: నిర్మలా సీతారామన్‌

16:25 May 13

  • ఇవాళ్టి నుంచి ఒక్కొక్కటిగా ఆర్థిక ప్యాకేజీ వివరాలు వెల్లడిస్తాం: నిర్మల
  • ఆదాయపన్ను చెల్లింపు రీఫండ్‌ల రూపేణ రూ.18 వేల కోట్లు చెల్లించాం: నిర్మల

16:21 May 13

  • డీబీబీ, సూక్ష్మస్థాయి బీమా, ఉజ్వల్‌ యోజనతో ఎంతో మేలు: నిర్మలా సీతారామన్‌
  • స్వచ్ఛభారత్‌ అభియాన్, ఆయుష్మాన్ భారత్‌ కీలక పథకాలు: నిర్మలా సీతారామన్‌
  • ఎఫ్‌డీఐ నిబంధనలు సరళీకరించి పెట్టుబడులకు మార్గం సుగమం చేశాం: నిర్మల
  • విద్యుత్‌రంగంలో స్వయం సమృద్ధి సాధించామంటే దాని ఫలితమే: నిర్మల
  • సాధించిన ఫలితాలే పునాదులుగా ఆత్మనిర్భర్‌ భారత్‌ ప్రాజెక్టు: నిర్మల
  • ఆత్మనిర్భర్‌ భారత్‌ నినాదం దేశ ప్రజలకు కొత్త ఉత్తేజాన్ని ఇస్తుంది: నిర్మల
  • కరోనా కష్టాల నుంచి పేదలకు ఉపశమనం కోసం గరీబ్ కల్యాణ్‌ యోజన: నిర్మల

16:16 May 13

  • గడిచిన ఐదేళ్లలో ఎన్నో సంస్కరణలు అమలు చేశాం‌: నిర్మల
  • ప్రత్యక్ష నగదు బదిలీ మా సంస్కరణలకు మేలిమి ఉదాహరణ‌: నిర్మల
  • ఆత్మనిర్భర భారత్ అభియాన్‌కు గత ఆరేళ్లలో తీసుకున్న సంస్కరణలే పునాదులు‌: నిర్మల

16:11 May 13

  • ఐదు మూల సూత్రాలుగా ఆత్మనిర్భర భారత్ అభియాన్‌: నిర్మల
  • ఆర్థిక, మౌలిక, సాంకేతిక, జనసంఖ్య, డిమాండ్‌ సూత్రాలు‌: నిర్మల
  • స్థానిక ఉత్పత్తులను ప్రపంచ వ్యాప్తం చేయడమే లక్ష్యం‌: నిర్మల
  • గత 40 రోజుల్లో మన శక్తేంటో ప్రపంచానికి తెలిసింది‌: నిర్మల
  • పీపీఈ కిట్లు, మాస్క్‌ల తయారీలో ఎంతో ప్రగతి సాధించాం‌: నిర్మల

16:08 May 13

  • ప్రధాని సమగ్రమైన దార్శనికతను దేశం ముందు ఉంచారు: నిర్మలా సీతారామన్‌
  • వివిధ స్థాయిల్లో సంప్రదింపుల తర్వాత ప్రధాని ఆర్థిక ప్యాకేజీ ప్రకటించారు: నిర్మల
  • దేశ ఆర్థికవృద్ధిని పెంచి స్వయం సమృద్ధి భారత్ లక్ష్యంగా ప్యాకేజీ: నిర్మల

16:06 May 13

  • కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ మీడియా సమావేశం
  • ప్రధాని ప్రకటించిన ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ వివరాల వెల్లడి

15:34 May 13

ఆర్థిక ప్యాకేజీ విధివిధానాలపై సీతారామన్​ ప్రకటన

కరోనా కారణంగా సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న భారత ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిన పెట్టేందుకు.. ప్రధాని మోదీ ప్రకటించిన 20లక్షల కోట్ల భారీ ఆర్థిక ప్యాకేజీ విధి విధానాలను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించనున్నారు. ఈ ప్యాకేజీలో వివిధ రంగాలకు నిధుల కేటాయింపులు, ఆయా రంగాలకు ప్యాకేజి వల్ల కలిగే ప్రయోజనాలు, ఆర్థిక కార్యకలాపాలు, ఆర్థిక వృద్ధి తదితర అంశాలపై వివరణ సహా, రాష్ట్రాలకు మార్గదర్శకాలు విడుదల చేయనున్నారు.

Last Updated : May 13, 2020, 5:48 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.