ETV Bharat / business

హల్వా వేడుకతో బడ్జెట్ ముద్రణ షురూ - హల్వా ఉత్సవం విశేషాలు

బడ్జెట్​ పత్రాల ముద్రణకు ముందు సంప్రదాయమైన హల్వా వేడుకను నేడు నిర్వహించారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. నార్త్​ బ్లాక్​లో జరిగిన ఈ ఉత్సవంలో.. ఆర్థిక శాఖ సహాయ మంత్రి సహా ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

halwa
హల్వా ఉత్సవం
author img

By

Published : Jan 20, 2020, 12:50 PM IST

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ హల్వా ఉత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్ సహా ఆర్థిక కార్యదర్శి, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

బడ్జెట్ ముద్రణకు ముందు సంప్రదాయం..

బడ్జెట్ పత్రాల ముద్రణకు ముందు ప్రతి ఏటా ఈ హల్వా ఉత్సవం జరపడం సంప్రదాయంగా వస్తోంది. ఒక పెద్ద కడాయిలో హల్వా తయారు చేసి అందరికీ పంచుతారు. నార్త్ బ్లాక్​లోని ఆర్థిక శాఖలో ఈ వేడుక జరుగుతుంది.

2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఫిబ్రవరి 1న పద్దు ప్రవేశపెట్టనునుంది కేంద్రం. ఆర్థిక మంత్రి హోదాలో నిర్మలా సీతారామన్​ బడ్జెట్​ ప్రవేశపెట్టనున్నారు.

గోప్యతకోసమే..

ఈ కార్యక్రమం మొదలైనప్పటి నుంచి పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశపెట్టేవరకు ముద్రణలో పాల్గొనే అధికారులకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోతాయి.

ఫోన్, ఈ-మెయిల్ లాంటి సౌకర్యాలూ ఉండవు. కార్యదర్శి స్థాయి అధికారులు మినహా ఎవరు ఇళ్లకు వెళ్లేందుకు వీలుండదు. బడ్జెట్​కు సంబంధించిన విషయాల్లో గోప్యత కోసం ఈ నిబంధనలు విధిస్తుంది ఆర్థిక శాఖ.

హల్వా వేడుకతో బడ్జెట్ ముద్రణ షురూ

ఇదీ చూడండి:ఆర్థిక వ్యవస్థకు 'ప్రకృతే' ఆధారం

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.