భారత్‌కు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల(ఎఫ్‌డీఐ) వెల్లువ కొనసాగుతున్నట్లు వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ వెల్లడించారు. దేశంలో అత్యంత సౌకర్యవంతమైన విధానాలు ఉన్నందున ఈ స్థాయిలో ఎఫ్‌డీఐలు వస్తున్నట్లు పేర్కొన్నారు. 'సీఐఐ భాగస్వామ్య సదస్సు 2020'లో పాల్గొన్న గోయల్ ఈ విషయాన్ని వెల్లడించారు.
కరోనా సంక్షోభం తీవ్రంగా ఉన్నా.. ఈ ఏడాది తొలి 9 నెలల్లో ఎఫ్‌డీఐలను భారీగా ఆకర్షించినట్లు తెలిపారు గోయల్. ఏప్రిల్-సెప్టెంబర్ మధ్య ఎఫ్‌డీఐలు 13శాతం పెరిగి.. 40 బిలియన్ డాలర్లకు చేరినట్లు పేర్కొన్నారు.
దాదాపు అన్ని రంగాలకు ఆటోమెటిక్ విధానం ద్వారా 100 శాతం ఎఫ్‌డీఐలకు అనుమతినిస్తున్నట్లు వివరించారు గోయల్.
అనుమతి తప్పనిసరి..
టెలికాం, మీడియా, ఫార్మా, బీమా రంగాల్లో ఎఫ్‌డీఐలకు మాత్రం ప్రభుత్వ అనుమతి తప్పనిసరి. లాటరీ, జూదం, బెట్టింగ్, చిట్ ఫండ్, రియల్ ఎస్టేట్, సిగరెట్లు, బీడీల తయారీ సహా మొత్తం తొమ్మిది రంగాల్లో ఎఫ్‌డీఐలు నిషేధం.
ఇదీ చూడండి:'రెండు దశాబ్దాల్లో.. టాప్-3 ఆర్థికవ్యవస్థల్లో భారత్'