ETV Bharat / business

ఏప్రిల్​లో ఫ్లాట్​గా తయారీ రంగ పీఎంఐ! - తయారీ రంగంలో పెరిగిన ఎగుమతులు

ఏప్రిల్​లో భారత తయారీ రంగ కార్యకలాపాలు దాదాపు ఫ్లాట్​గా నమోదయ్యాయి. ఎగుమతులు పెరిగిన నేపథ్యంలో పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ 55.5గా నమోదైనట్లు ఐహెచ్ఎస్​ మార్కిట్ నెలవారీ నివేదిక పేర్కొంది.

Manufacturing PMI marginally rise
ఏప్రిల్ పీఎంఐ డేటా
author img

By

Published : May 3, 2021, 1:05 PM IST

దేశీయ తయారీ రంగ కార్యకలాపాలు ఏప్రిల్​లో దాదాపు ఫ్లాట్​గా నమోదయ్యాయి. కొత్త ఆర్డర్లు దాదాపు 8 నెలల కనిష్ఠం వద్ద స్థిరంగా ఉన్నట్లు ఐహెచ్​ఎస్​ మార్కిట్ ఇండియా నెలవారీ నివేదిక ద్వారా వెల్లడించింది. కరోనా రెండో దశ ప్రభావం తయారీ రంగంపై తీవ్రంగా పడినట్లు పేర్కొంది.

ఐహెచ్​ఎస్​ మార్కిట్ ప్రకారం ఏప్రిల్​లో తయారీ రంగం పీఎంఐ (పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్​) 55.5గా నమోదైంది. మార్చిలో ఇది 55.4.

ఏప్రిల్​లో తయారీ రంగ ఎగుమతులు మాత్రం పెరిగినట్లు నివేదిక వెల్లడించింది. అంతర్జాతీయంగా భారతీయ ఉత్పత్తులకు గిరాకీ పుంజుకోవడమే ఇందుకు కారణంగా వివరించింది.

ఇదీ చదవండి:'అంతర్జాతీయ మార్కెట్లోకి ఓలా ఈ-స్కూటర్లు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.