ETV Bharat / business

వరుసగా మూడో నెలలోనూ ఎగుమతుల్లో క్షీణత - ఎగుమతులు దిగుమతులు

భారత ఎగుమతులు వరుసగా మూడో నెలలోనూ క్షీణించాయి. డిసెంబర్​లో 0.8 శాతం పెరిగి 26.89 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. మరోవైపు, ఎగుమతులు పెరగడం వల్ల వాణిజ్య లోటు 15.71 బిలియన్ డాలర్లకు ఎగబాకింది.

Exports fall 0.8 pc in Dec, trade deficit widens to USD 15.71 bn
వరుసగా మూడో నెలలోనూ ఎగుమతుల్లో క్షీణత
author img

By

Published : Jan 2, 2021, 4:16 PM IST

వరుసగా మూడో నెలలోనూ దేశ ఎగుమతులు క్షీణత నమోదు చేశాయి. డిసెంబరులో దేశీయ ఎగుమతులు 0.8శాతం క్షీణించి 26.89 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. పెట్రోలియం, తోలు, సముద్ర ఉత్పత్తుల్లో క్షీణతే ఎగుమతుల తగ్గుదలకు కారణమని కేంద్ర ప్రభుత్వ గణాంకాలు వెల్లడిస్తున్నాయి.

ఇదే సమయంలో దిగుమతులు 7.6 శాతం పెరిగి 42.6 బిలియన్ డాలర్లకు చేరాయి. ఫిబ్రవరి తర్వాత పాజిటివ్ వృద్ధి రేటు నమోదు కావడం ఇదే ప్రథమం. ఎగుమతుల క్షీణత వల్ల వాణిజ్య లోటు 25.78 శాతం పెరిగింది. 15.71 బిలియన్ డాలర్లకు ఎగబాకింది.

2019 డిసెంబరులో దేశ ఎగుమతులు 27.11 బిలియన్ డాలర్లుగా, దిగుమతులు 39.5 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. 2020 నవంబరులో దేశ ఎగుమతులు 8.74 శాతం క్షీణించాయి.

మొత్తంగా 2021 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-డిసెంబర్ కాలంలో దేశ సరకు ఎగుమతులు 15.8 శాతం పడిపోయి 200.55 బిలియన్ డాలర్లకు చేరాయి. దిగుమతులు 29.08 శాతం క్షీణించి 364.18 బిలియన్లకు పరిమితమయ్యాయి.

డిసెంబర్​లో చమురు దిగుమతులు 10.37 శాతం తగ్గిపోయాయి. ఏప్రిల్-డిసెంబర్ మధ్య 44.46 శాతం క్షీణించి 53.71 బిలియన్ డాలర్లకు చేరాయి.

ఎగుమతుల్లో పాజిటివ్-నెగిటివ్

కాగా.. ఎగుమతుల విషయంలో ఆయిల్ మీల్స్(192.60 శాతం), ఇనుప ధాతువు(69.26), కార్పెట్(21.12), ఫార్మాస్యూటికల్స్(17.44), సుగంధ ద్రవ్యాలు(17.60), ఎలక్ట్రానిక్ గూడ్స్(16.44) పండ్లు-కూరగాయలు(12.82), రసాయనాలు(10.73) సానుకూల వృద్ధి రేటు నమోదు చేశాయి.

మరోవైపు పెట్రోలియం ఉత్పత్తులు(-40.47), నూనె గింజలు(-31.80), తోలు(-17.74), కాఫీ(-16.39), రెడిమేడ్ గార్మెంట్స్(-15.07), పొగాకు(-4.95) వంటి రంగాలు ప్రతికూల వృద్ధిని నమోదు చేశాయి.

దిగుమతులు ఇలా..

దిగుమతుల్లో పప్పుధాన్యాలు(245.15 శాతం), బంగారం(81.82), వెజిటేబుల్ ఆయిల్(43.50), రసాయనాలు(23.30), ఎలక్ట్రానిక్ వస్తువులు(20.90), మెషీన్ టూల్స్(13.46), విలువైన రాళ్లు(7.81), ఫర్టిలైజర్స్(1.42శాతం) పాజిటివ్ వృద్ధి నమోదు చేయగా.. వెండి, న్యూస్ ప్రింట్, రవాణా పరికరాలు, బొగ్గు వంటి ఉత్పత్తులు ప్రతికూల వృద్ధిని నమోదు చేశాయి.

ఇదీ చదవండి: డిసెంబర్​లో దూసుకుపోయిన దేశీయ వాహనాల అమ్మకాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.