ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఎఫ్ఓ) 2019-20 ఆర్థిక సంవత్సరానికి.. 8.5 శాతం వడ్డీని ఒకే విడతలో జమ చేయాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఆరు కోట్ల ఈపీఎఫ్ ఖాతాల్లో ఈ నెలలోనే వడ్డీ మొత్తాన్ని జమ చేయనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.
సెప్టెంబర్లో 8.5 శాతం వడ్డీని.. 8.15 శాతంగా, 0.35 శాతంగా విభజించి రెండు విడతల్లో జమ చేయాలని నిర్ణయించింది కార్మిక శాఖ. కొన్ని పెట్టుబడులను ఉపసంహరించుకుని ఈ వడ్డీ మొత్తం చెల్లించాలని ఈపీఎఫ్ఓ భావించింది. అయితే కరోనా వల్ల మార్కెట్లలో ఏర్పడిన అస్థిరతల కారణంగా ఇది సాధ్యం కాలేదు.
ప్రస్తుతం మార్కెట్లు ఆశించిన స్థాయికన్నా పెరిగి.. రికార్డు స్థాయిల వద్ద ఉన్న నేపథ్యంలో ఒకే విడతలో 8.5 శాతం వడ్డీ చెల్లించేందుకు ఈపీఎఫ్ఓకు సమస్యలేదని తెలుస్తోంది.
ఇదీ చూడండి:స్టాక్ మార్కెట్లోకి నీరు!!