కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన 43 జీఎస్‌టీ మండలి (GST Council Meet) సమావేశమైంది. కరోన నేపథ్యంలో వర్చువల్గా మండలి భేటీ జరుగుతోంది. ఈ సమావేశంలో అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ఆర్థిక మంత్రులు, ఇతర అధికారులు పొల్గొన్నారు.
జీఎస్‌టీ మండలి భేటీ కావడం ఈ ఏడాది ఇదే తొలిసారి. చివరిసారిగా అక్టోబర్ 5న జీఎస్‌టీ మండలి(GST council meet) సమావేశమైంది.
భేటీలో చర్చాంశాలు..
భాజపాయేతర పాలిత రాష్ట్రాల (రాజస్థాన్, పంజాబ్, ఛత్తీస్‌గఢ్, తమిళనాడు, మహారాష్ట్ర, ఝార్ఖండ్, కేరళ, బంగాల్) ఆర్థిక మంత్రులు సంయుక్త వ్యూహాన్ని అనుసరించాలని, కొవిడ్ అత్యవసరాలపై జీఎస్‌టీ లేకుండా (జీరో ట్యాక్స్) చూడాలని కోరబోతున్నారని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.
కొవిడ్ ఔషధాలు, వ్యాక్సిన్లు(COVID vaccine), వైద్య పరికరాలపై వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ) తగ్గింపు, రాష్ట్రాలకు ఆదాయం తగ్గిన నేపథ్యంలో అధిక పరిహారం చెల్లింపు వంటి అంశాలు ప్రధానంగా చర్చకు రానున్నాయి.
మీడియా ముందుకు సీతారామన్..
భేటీ ముగిసిన అనంతరం శుక్రవారం రాత్రి 7 గంటలకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మీడియాతో మాట్లాడనున్నారు. భేటీలో తీసుకున్న నిర్ణయాలను వివరించనున్నారు.
ఇదీ చదవండి:ఎఫ్డీఐ పాలసీకి కేంద్రం సవరణ!