ఆర్థిక వ్యవస్థ 2014-19 మధ్యలో అత్యంత స్థిరంగా ఉందని ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రసంగంలో తెలిపారు. అధిక వృద్ధి సాధించటంతో పాటు ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయటంలో ఎన్డీఏ ప్రభుత్వం విజయం సాధించిందని వ్యాఖ్యానించారు.
" దేశం స్థూల ఆర్థిక వ్యవస్థ స్థిరత్వంలో అత్నున్నత స్థానాన్ని 2014-19 మధ్యలోనే చూసింది. ప్రస్తుతం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో భారత్ ఒకటి. గత ఐదు సంవత్సరాల్లో సరాసరి జీడీపీ వృద్ధి ఎక్కువ ఉంది. ఇది ఆర్థిక సంస్కరణలప్పటి నుంచి గత అన్ని ప్రభుత్వాలు సాధించిన దానికంటే ఎక్కువ.
2013-14లో 11వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న ప్రస్తుతం ఆరోస్థానానికి చేరింది. అధిక వృద్ధిని సాధించటంతో పాటు రెండంకెల ద్రవ్యోల్బణాన్ని నియంత్రించి, ద్రవ్య స్థిరత్వాన్ని సాధించాం. 2009-14 మధ్య సరాసరి ధరల పెరుగుదల 10.1 శాతం ఉండేది. " - ఆర్థికమంత్రి, పీయూష్ గోయల్
మధ్యంతర బడ్జెట్ 2019