ETV Bharat / business

RBI report: వృద్ధి అంచనాలపై కరోనా రెండో దశ ఎఫెక్ట్​

2021-22 సంవత్సరానికి ఇప్పటివరకు ఉన్న ఆర్థిక వృద్ధి అంచనాను పునఃపరిశీలించాలని ఆర్​బీఐ పేర్కొంది. కరోనా రెండో దశ వ్యాప్తే ఇందుకు కారణంగా తెలుస్తోంది. ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేస్తూ ఆర్థిక వృద్ధి గాడిన పడేలా మానిటరీ పాలసీ ఏర్పాటు ఉపయోగపడుతుందని తెలిపింది.

rbi annual report, ఆర్​బీఐ ఆర్థిక వృద్ధి అంచనా
ఆర్​బీఐ అంచనా తప్పింది
author img

By

Published : May 27, 2021, 3:22 PM IST

Updated : May 27, 2021, 3:27 PM IST

కరోనా రెండో దశ(covid second wave) వ్యాప్తి కారణంగా దేశ ఆర్థిక వృద్ధి అంచనాను పునఃపరిశీలించాల్సిన అవసరం ఏర్పడిందని ఆర్​బీఐ వెల్లడించింది. 2020-2021 సంవత్సరానికి గానూ గురువారం విడుదల చేసిన వార్షిక నివేదిక(RBI annual report)లో ఈ విషయాన్ని పేర్కొంది. మహమ్మారి కారణంగా గత ఏడాది ఆర్థిక వృద్ధి దెబ్బతిందని పేర్కొంది. 2021-22 సంవత్సరంలో 10.5శాతం వృద్ధి లభిస్తుందని.. క్యూ1లో 26.2 శాతం, క్యూ2లో 8.3 శాతం, క్యూ3లో 5.4 శాతం, క్యూ4లో 6.2 శాతం వృద్ధి నమోదవుతుందని ఆర్​బీఐ ఇదివరకు అంచనా వేసింది.

మహమ్మారి ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతున్నా.. ప్రభుత్వం దానిని ఎదుర్కొనేందుకు ప్రయత్నిస్తోందని ఆర్​బీఐ పేర్కొంది. అయితే ఈ సమయంలో ప్రపంచ దేశాలు కలిసికట్టుగా పనిచేయడం వల్ల.. ఎవరికి వారు స్వతంత్రంగా పోరాడిన దాని కన్నా మెరుగైన ఫలితాలు వస్తాయని అభిప్రాయపడింది. ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేస్తూ ఆర్థిక వృద్ధి గాడిన పడేలా 2021-2022 సంవత్సరానికి ద్రవ్య విధానాల ఏర్పాటుతు ఉపయోగపడుతుందని తెలిపింది.

ఇదీ చదవండి : Inflation: 'వ్యవస్థను వెంటాడుతున్న ద్రవ్యోల్బణం'

Last Updated : May 27, 2021, 3:27 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.