ETV Bharat / business

ఈ ఏడాది ఇంధన గిరాకీ -11.5 శాతం! - ఫిచ్ సొల్యూషన్స్ ఇంధన గిరాకీ

కరోనాతో నెలకొన్న పరిస్థితుల కారణంగా దేశంలో ఈ ఏడాది ఇంధన గిరాకీ భారీగా తగ్గొచ్చని ఫిచ్‌ సొల్యూషన్స్‌ అంచనా వేసింది. ఇంతకు ముందు -9.4 శాతంగా ఉన్న ఇంధన డిమాండ్ అంచనాను -11.5 శాతానికి సవరించింది.

FUAL DEMAND DOWN IN INDIA
దేశంలో తగ్గనున్న ఇంధన డిమాండ్
author img

By

Published : Sep 20, 2020, 6:56 AM IST

భారత్‌లో ఈ ఏడాది ఇంధన గిరాకీ 11.5 శాతం మేర క్షీణించవచ్చని ఫిచ్‌ సొల్యూషన్స్‌ అంచనా వేస్తోంది. 2020-21లో భారత వాస్తవ జీడీపీ -4.5 శాతంగా నమోదు కావొచ్చన్న అంచనాలను కాస్తా -8.6 శాతానికి ఆర్థికవేత్తలు సవరించడం ఇందుకు నేపథ్యం.

అంతక్రితం ఇంధన గిరాకీ వృద్ధి అంచనా -9.4 శాతంగా ఉంది. దేశవ్యాప్త లాక్‌డౌన్‌ మే 31నే ఎత్తివేసినా.. రాష్ట్ర స్థాయిలో కొన్ని చోట్ల నిబంధనలు కొనసాగుతుండడం ఆర్థిక రికవరీని ఆలస్యం చేస్తున్నాయని ఫిచ్​ తెలిపింది. అటు వినియోగదారు, ఇటు పరిశ్రమ స్థాయిల్లో ఇంధనానికి గిరాకీ తగ్గుతున్నట్లు కనిపిస్తోందని పేర్కొంది.

వచ్చే ఏడాది మాత్రం కరోనా కాస్త ఆదుపులోకి వచ్చి.. ఆర్థిక కార్యకలాపాలు సాధారణ స్థాయికి చేరుతాయని ఫిచ్ ఆశాభావం వ్యక్తం చేసింది. దీనితో 2021, 2022లో ఇంధన గిరాకీలో 5 శాతం వార్షిక వృద్ధి నమోదు కావొచ్చని తెలిపింది.

ఇదీ చూడండి:బీఎండబ్ల్యూ కొత్త బైక్‌ @ రూ.18.9 లక్షలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.