కరోనా నియంత్రణకు చర్యలు చేపట్టడంలో గ్రామీణ స్థానిక సంస్థల(ఆర్ఎల్బీ)కు సహాయం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం రూ. 8,923కోట్లను గ్రాంట్లుగా విడుదల చేసింది. మొత్తం 25 రాష్ట్రాలకు ఈ నిధులు అందనున్నాయి. ఈ విషయాన్ని కేంద్ర ఆర్థికశాఖ వెల్లడించింది.
పంచాయతీ రాజ్ వ్యవస్థలోని గ్రామం, మండలం, జిల్లాలకు ఈ నిధులు అందుతాయని అధికారిక ప్రకటనలో పేర్కొంది కేంద్రం. కరోనా కట్టడి కోసం ఈ నిధులను ఉపయోగించుకోవచ్చని స్పష్టం చేసింది.
15వ ఆర్థిక కమిషన్ సిఫార్సుల మేరకు.. ఈ గ్రాంట్లకు సంబంధించిన తొలి ఇన్స్టాల్మెంట్.. 2021 జూన్లో విడుదల కావాల్సి ఉంది. అయితే దేశంలో కరోనా రెండో దశ పరిస్థితులు, పంచాయతీ రాజ్ మంత్రిత్వశాఖ సిఫార్సుల మేరకు.. ముందుగానే నిధులను విడుదల చేయాలని కేంద్ర ఆర్థికశాఖ నిర్ణయించింది.
ఇదీ చూడండి:- కొవిడ్ కాలంలో.. చిన్న పరిశ్రమలకు చేయూత