పార్లమెంటు బడ్జెట్ సమావేశాలను జనవరి 31 నుంచి ఏప్రిల్ 3 వరకు రెండు విడతల్లో నిర్వహించాలని పార్లమెంటరీ వ్యవహారాల కేబినెట్ కమిటీ సిఫార్సు చేసింది. ఫిబ్రవరి 1న బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
జనవరి 31 నుంచి ఫిబ్రవరి 11 వరకు మొదటి విడత.. మార్చి 2 నుంచి ఏప్రిల్ 3 వరకు రెండో విడత బడ్జెట్ సమావేశాలు నిర్వహించనున్నట్టు తెలుస్తోంది.
రెండు విడతల మధ్య వచ్చే నెల రోజుల విరామంలో పార్లమెంటరీ కమిటీలు వివిధ మంత్రిత్వశాఖలకు కేటాయించిన బడ్జెట్‌ను పరిశీలిస్తాయి. కేంద్రమంత్రివర్గ సిఫార్సుల మేరకు పార్లమెంటు ఉభయసభలను రాష్ట్రపతి సమావేశ పరుస్తారు.
ఇదీ చూడండి:'ఖనిజ చట్టాల సవరణ ఆర్డినెన్స్'కు ఆమోదం