ETV Bharat / business

కరోనా ఆర్థిక ప్యాకేజీకి కేబినెట్​ ఆమోదం - central cabinet news

CABINET APPROVAL
కరోనా ఆర్థిక ప్యాకేజీకి కేబినెట్​ ఆమోదం
author img

By

Published : May 20, 2020, 2:42 PM IST

Updated : May 20, 2020, 3:38 PM IST

14:37 May 20

కరోనా ఆర్థిక ప్యాకేజీకి కేబినెట్​ ఆమోదం

రూ.20 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీకి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. కరోనాతో దెబ్బతిన్న అన్ని రంగాలకు పునరుజ్జీవం అందించేందుకు ఆత్మనిర్భర్​ భారత్‌ పథకం కింద ఈ ప్యాకేజీని ప్రకటించారు ప్రధాని నరేంద్ర మోదీ. 

ఆర్థిక ప్యాకేజీతోపాటు మరికొన్ని కీలక నిర్ణయాలకు ఆమోద ముద్ర వేసింది కేబినెట్.

  1. ఎమర్జెన్సీ క్రెడిట్​ లైన్​ గ్యారంటీ స్కీమ్​ (ఈసీఎల్​జీఎస్​) ద్వారా అదనంగా రూ. 3 లక్షల కోట్ల నిధులు కేటాయించేందుకు ఆమోదం తెలిపింది మంత్రివర్గం. నేషనల్​ క్రెడిట్​ గ్యారంటీ ట్రస్టీ కంపెనీ (ఎన్​సీజీటీసీ) ద్వారా మెంబర్​ లెండిగ్​ సంస్థలకు 100 శాతం రుణానికి హామీ ఇవ్వనున్నారు. అర్హతగల సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థలు(ఎంఎస్​ఎంఈ), ఔత్సాహిక ముద్ర రుణగ్రహీతలకు గ్యారంటీడ్​ ఎమర్జెన్సీ క్రెడిట్​ లైన్​ సదుపాయం కల్పించేందుకు వీలు కలుగుతుంది.
  2. రెవెన్యూ షేరింగ్ విధానంలో బొగ్గు గనుల వేలానికి సంబంధించిన విధివిధానాల్ని కేంద్ర కేబినెట్ ఆమోదించింది. 
  3. హిందుస్థాన్​ ఆర్గానిక్​ కెమికల్స్​ లిమిటెడ్​ రుణాలపై వడ్డీ మాఫీకి కేబినెట్​ ఆమోదం తెలిపింది.
  4. ప్రధానమంత్రి వయ వందన యోజనను 2020 మార్చి 31 వరకు పొడిగించేందుకు అంగీకారం తెలిపింది మంత్రివర్గం.
  5. లాక్​డౌన్​తో వివిధ ప్రాంతాల్లో చిక్కుకున్న వలస కూలీలకు ఆహారపదార్థాలు అందించేందుకు ఆత్మనిర్భర్​ భారత్​ ప్యాకేజీకి కేబినెట్​ ఆమోదం తెలిపింది.

Last Updated : May 20, 2020, 3:38 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.