పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు జనవరి 31 నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉన్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న లోక్‌సభలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఇందుకోసం త్వరలో సమావేశం కానున్న రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ నేతృత్వంలోని పార్లమెంట్ వ్యవహారాల కేబినెట్ కమిటీ.. తుది తేదీలపై చర్చించి నిర్ణయం తీసుకోనుంది.
ఈ విషయంపై ఒకటి, రెండు రోజుల్లోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని సమాచారం. ఈసారి బడ్జెట్ సమావేశాలు సుదీర్ఘంగా ఏప్రిల్ వరకు జరగనున్నట్లు తెలుస్తోంది.