ETV Bharat / business

'బాయ్​కాట్ చైనా' సాధ్యమేనా? లాభదాయకమేనా? - భారత్​ చైనా వాణిజ్య యుద్ధం

'బాయ్​కాట్​ చైనా'.. ఇటీవల ఎక్కువగా వినిపిస్తున్న నినాదం. సరిహద్దుల వెంబడి చైనా చేస్తున్న చొరబాట్లకు వ్యతిరేకంగా చాలా మంది ఈ డిమాండ్​నే లేవనెత్తుతున్నారు. చైనాతో వాణిజ్య బంధాన్ని పూర్తిగా తెగదెంపులు చేసుకోవాలని ప్రభుత్వానికి సూచిస్తున్నారు. అయితే 'బాయ్​కాట్ చైనా' అనేది ఎంత వరకు సాధ్యం? ఒకవేళ అదే జరిగితే ఎవరికి ఎక్కువ నష్టం? చైనాను ఆర్థికంగా మన దేశం దెబ్బతీయగలదా? ఈ విషయాలన్నింటిపై నిపుణుల విశ్లేషణలు ఇలా ఉన్నాయి..

Boycott China is not possible to India
బాయ్​కాట్​ చైనా లాభామా నష్టమా
author img

By

Published : Jun 20, 2020, 2:03 PM IST

భారత్​లో కొన్ని రోజుల నుంచి 'బాయ్​కాట్ చైనా' నినాదం ఎక్కువగా వినిపిస్తోంది. తూర్పు లద్దాక్​లోని గల్వాన్ లోయలో​ చైనా దళాలు భారత్​లోకి చొచ్చుకొచ్చి.. 20 మంది సైనికులను బలిగొన్న తర్వాత దీనికి మద్దతు మరింత పెరిగింది.

ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో యుద్ధం కన్నా చైనాను ఆర్థికంగా దెబ్బతీయడమే ఉత్తమమని కొంత మంది అభిప్రాయపడుతున్నారు. ప్రత్యక్ష యుద్ధం, అణు దాడులు వంటివి కాకుండా సైనికేతర దాడులతోనే చైనాకు బుద్ది చెప్పే మార్గాలు ఎంచుకోవాలి అని అంటున్నారు.

ఆర్థికంగా దెబ్బతీయడం సాధ్యమేనా?

'బాయ్​కాట్ చైనా' వినేందుకు బాగానే ఉన్నా.. అది అంత సులువు కాదంటున్నారు వాణిజ్య నిపుణులు. ఎందుకంటే భారత్​లో చాలా రంగాలు​ చైనా దిగుమతులపై ఆధారపడి ఉన్నాయి. ముఖ్యంగా ఫార్మా, హెవీ ఇంజినీరింగ్, ఐటీ, ఎలక్ట్రానిక్ రంగాలకు చైనా దిగుమతులు ఎంతో కీలకం.

ఎగుమతుల్లో భారత్, చైనా స్థానాలు..

భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) సర్వే ప్రకారం.. ప్రపంచంలో అతిపెద్ద ఎగుమతిదారుల్లో చైనా ప్రధానమైంది. ప్రపంచవ్యాప్త ఎగుమతుల్లో 13 శాతం, దిగుమతుల్లో 11 శాతం వాటాను కలిగి ఉంది చైనా. ప్రపంచ వాణిజ్యంలో చైనా వాటా 13.3 శాతంగా ఉంది. అగ్రరాజ్యం అమెరికా వాటా 8 శాతంగా ఉండగా.. భారత్​ 1.7 శాతం వాటాను మాత్రమే కలిగి ఉంది.

భారత్-చైనా ద్వైపాక్షిక వాణిజ్యం..

ఇరు దేశాల ద్వైపాక్షిక వాణిజ్యాన్ని పరిశీలిస్తే చైనాకే దేశానికే ఎక్కువ అనుకూలతలు ఉన్నట్లు తెలుస్తోంది.

2018-19 గణాంకాల ప్రకారం చైనా-భారత్ మధ్య 87 బిలియన్​ డాలర్ల ఎగుమతి, దిగుమతులు జరిగాయి. ఇందులో చైనా నుంచి మన దేశం చెసుకున్న దిగుమతుల విలువ 70.3 బిలియన్​ డాలర్లుగా ఉంది. మన దేశం నుంచి చైనాకు చేసిన ఎగుమతుల విలువ 16.75 బిలియన్ డాలర్లుగా ఉన్నట్లు తెలిసింది. దీని ప్రకారం భారత్​కు 53.55 బిలియన్ డాలర్ల వాణిజ్య లోటు ఏర్పడింది.

వాణిజ్య లోటుతో నష్టాలేమిటి?

ఏదైనా దేశంతో వాణిజ్య లోటు ఏర్పడింది అంటే.. దిగుమతుల కన్నా ఎగుమతులు తక్కువగా ఉన్నాయని అర్థం. దిగుమతులు ఎక్కువగా ఉన్నాయి అంటే.. వాటిని కొనుగోలు చేసేందుకు మన దేశం డాలర్లలో లావాదేవీలు జరపాల్సి ఉంటుంది. దీని వల్ల మన దేశంలో విదేశీ మారకపు నిల్వలు తగ్గిపోతాయి.

మన ఎగుమతులు ముడి సరుకే..

భారత్ నుంచి చైనాకు ఎగుమతయ్యే వాటిలో ముడి సరుకే ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఉక్కు, ఇతర ముడి పదార్థాలను చైనాకు ఎగుమతి చేస్తోంది మన దేశం.

చైనా మాత్రం ఇందుకు పూర్తి విరుద్ధంగా వినియోగదారులకు నేరుగా విక్రయించే వస్తువులైన.. ఇంజినీరింగ్ పరికరాలు, ల్యాప్​టాప్​లు, మొబైల్ ఫోన్లు, ఐటీ ఉత్పత్తులు వంటివి ఎగుమతి చేస్తోంది. ఔషధాల తయారీకి కావాల్సిన కీలకమైన ముడి రసాయానాలను కూడా చైనా భారత్​కు ఎగుమతి చేస్తోంది.

భారత్-చైనా వాణిజ్య సామర్థ్యాలు..

భారత్​ ప్రపంచవ్యాప్తంగా చేస్తున్న ఎగుమతుల్లో చైనా వాటా 3 శాతం మాత్రమే. చైనా ప్రపంచవ్యాప్తంగా చేసుకుంటున్న దిగుమతుల్లో భారత్​ వాటా 1 శాతం మాత్రమే. దీని ఆధారంగా చైనాకు ఎగుమతులు పూర్తిగా నిలిపేసినా.. ఆ దేశానికి ఒక శాతం దిగుమతులపై మాత్రమే ప్రభావం పడుతుంది. ఈ లోటును భర్తీ చేసుకోవడం చైనాకు పెద్ద సమస్య కాదంటున్నారు నిపుణులు.

ఇదే సమయంలో భారత్​ ప్రపంచవ్యాప్తంగా చేసుకుంటున్న దిగుమతుల్లో చైనా వాటా 14 శాతంగా ఉంది. ప్రపంచ దేశాలకు చైనా చేస్తున్న ఎగుమతుల్లో భారత్​ వాటా 5 శాతంగా ఉంది. ఒకవేళ ఇరు దేశాలు దైపాక్షిక వాణిజ్యం ఆపేస్తే.. చైనా ఎగుమతులపై తీవ్ర ప్రభావం పడుతుంది. అయితే అంతకంటే ఎక్కువగా భారత దిగుమతులపై ప్రభావం పడుతుంది. ఆ లోటును భర్తీ చేసుకోవడం భారత్​కు ఇప్పుడు అంత సులువు కాదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

trade strengths
భారత్​ చైనా సామర్థ్యాలు

అదే జరిగితే ఆ రంగాలకు కుదుపే..

ఇరు దేశాల వాణిజ్య సంబధాలను ఇంకా లోతుగా పరిశీలిస్తే.. ఎలక్ట్రానిక్ ఉపకరణాల విషయంలో భారత్​ తన అవసరాల్లో 45 శాతం వరకు చైనా దిగుమతుల ద్వారానే తీర్చుకుంటోంది. వీటితో పాటు మూడింట ఒక వంతు యంత్రాలు, 40 శాతం కర్బన రసాయనాలు చైనా నుంచే దిగుమతి చేసుకుంటోంది మన దేశం.

వాహన రంగ విడిభాగాల్లో 25 శాతం చైనా నుంచే మన దేశం దిగుమతి చేసుకుంటోందని సీఐఐ సర్వేలో తేలింది.

ఫార్మా, టెలికాం రంగాలకు దిగుమతులే దిక్కు..

దేశీయంగా కీలక రంగాలైన ఫార్మా, టెలికాం రంగాల్లో చైనాపైనే భారత్​ ఎక్కువగా ఆధారపడాల్సి వస్తోంది.

ప్రపంచంలో అతిపెద్ద జెనెరిక్ ఔషధ ఉత్పత్తి దేశాల్లో భారత్​ కూడా ఒకటి. ఈ స్థాయిలో ఉత్పత్తి చేసేందుకు 'యాక్టివ్ ఫార్మాసూటికల్ ఇంగ్రేడియంట్స్​'గా పిలిచే ముడి సరుకును చైనా నుంచే ఎక్కువగా దిగుమతి చేసుకుంటోంది మన దేశం. ముఖ్యంగా చైనాలోని వుహాన్ నుంచి ఈ దిగుమతులు ఎక్కువగా ఉంటాయి.

ఈ ఏడాది ప్రారంభంలో కరోనా కట్టడిలో భాగంగా వుహాన్​లో విధించిన సంపూర్ణ లాక్​డౌన్​తో.. మన దేశంలో ఔషధాల ధరలు పెంచాల్సి వచ్చింది. ఔషధ రంగంపై చైనా ప్రభావం ఎంతలా ఉందో చెప్పేందుకు ఇదొక చిన్న ఉదాహరణ మాత్రమే.

Pharma depends china for more
ఫార్మా రంగానికి దిగుమతులే దిక్కు

టెలికాం రంగంలో చైనా ఉత్పత్తుల హవా చెప్పనక్కర్లేదు.. సీఐఐ సర్వే ప్రకారం దేశంలో తయారయ్యే 90 శాతం మొబైల్​ ఫోన్ల విడిభాగాలు చైనా నుంచి దిగుమతి చేసుకున్నవేనని తెలిసింది.

షియోమీ, రియల్​మీ, ఓప్పో, వివో, వన్​ప్లస్​ వంటి చైనా సంస్థలు 70 శాతం మార్కెట్ వాటాతో దేశ మొబైల్​ పరిశ్రమను శాసిస్తున్నాయి. మిగిలిన మొత్తంలోనూ అమెరికా, జపాన్, కొరియా సంస్థలైన యాపిల్, శాంసంగ్, ఎల్​జీ, సోనీ ఉన్నాయి.

china mobiles In India
భారత్​ మొబైల్ మార్కెట్లో చైనా కంపెనీల హవా

చైనాపై భారత్ ఆంక్షలు?

దేశ సరిహద్దుల వెంబడి నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో చైనాపై భారత్​ ఆంక్షలు విధించనుంది అని పలు మీడియాల్లో ఇటీవల వార్తలొచ్చాయి.

నిపుణుల ప్రకారం భారత్​ మాత్రమే కాదు ప్రపంచవ్యాప్తంగా ఎంతో అభివృద్ధి చెందిన దేశాలు కూడా చైనా దిగుమతులపై చాలా వరకు ఆధారపడినట్లు చెబుతున్నారు. కొన్ని అంచనాల ప్రకారం.. వందకు పైగా దేశాలకు.. పూర్తిగా తయారైన లేదా విడిభాగాలను చైనా ఎగుమతి చేస్తోంది.

ఒకవేళ ప్రభుత్వం తప్పనిసరి పరిస్థితుల్లో చైనాపై ఆంక్షలు విధిస్తే.. ముడి సరుకు కోసం పరిశ్రమ వర్గాలు ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారించొచ్చు అని సిండికేట్ బ్యాంక్​ సీఈఓ, మృత్యుంజయ మహాపాత్ర ఈటీవీ భారత్​తో చెప్పుకొచ్చారు.

"గత ఏడాది చైనా సంస్థలపై ఆంక్షలు విధిస్తూ అమెరికా నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా హువావే సంస్థ ఉపకరణాలు వాడొద్దని టెలికాం సంస్థలను ఆదేశించింది ట్రంప్ యంత్రాంగం. ఈ నేపథ్యంలో చాలా సంస్థలు ఐరోపాలో ఉన్న తమ అనుబంధ సంస్థల ద్వారా ఈ నిబంధనలను అధిగమించే పని చేశాయి. ఇప్పుడు భారతీయ సంస్థలు కూడా ఇలాంటి మార్గాలనే అన్వేషించొచ్చు."

- మృత్యుంజయ మహాపాత్ర, సిండికేట్ బ్యాంక్​ సీఈఓ

(రచయిత- కృష్ణానంద్ త్రిపాఠి)

ఇదీ చూడండి:భారత్​లో చైనా వస్తువులను నిషేధిస్తే నష్టమెవరికి?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.