దేశవ్యాప్తంగా అక్షయ తృతీయ సందడి నెలకొంది. పసిడి కొనుగోళ్లకు మంచి రోజన్న నమ్మకంతో మహిళలు పెద్దసంఖ్యలో దుకాణాలకు తరలివస్తున్నారు.
ఈ సెంటిమెంట్‌ను సొమ్ము చేసుకునేందుకు పుత్తడి వ్యాపారులు ఆకర్షణీయ ఆఫర్లతో ముందుకొస్తున్నారు.
అక్షయ తృతీయ పర్వదినాన పుణ్యకార్యాలతో పాటు పసిడి కొనుగోళ్లు జరిపితే లక్ష్మీ కటాక్షం మెండుగా ఉంటుందని నమ్మకం. అందుకే ఈ రోజు అత్యధికంగా పసిడి కొనుగోళ్లకు మొగ్గుచూపుతారు.
దేశవ్యాప్తంగా ప్రస్తుతం 10 గ్రాముల బంగారం ధర సుమారు రూ. 32,600లుగా ఉంది.