ETV Bharat / business

ఆన్​లైన్​లో ఆటో బుకింగ్ ఇక భారం- జీఎస్​టీనే కారణం - జీఎస్​టీ ఆటో రిక్షా ఇ కామర్స్​

ఆన్​లైన్​లో ఆటో బుక్​ చేసుకునే వారికి కేంద్రం చేదు వార్త చెప్పింది. ఈ సేవలపై(Gst on auto rickhaw e commerce) వచ్చే ఏడాది జనవరి 1 నుంచి 5శాతం జీఎస్​టీ విధిస్తున్నట్లు చెప్పింది.

Gst on auto rickhaw e commerce
ఆన్​లైన్​లో ఆటో బుకింగ్స్​పై జీఎస్​టీ
author img

By

Published : Nov 26, 2021, 7:09 PM IST

ఆన్​లైన్ వేదికగా అందించే ఆటో రిక్షా రవాణా సేవలు ఇక జీఎస్​టీ(Gst on online auto rikshaw services) పరిధిలోకి రానున్నాయి. 2022 జనవరి 1 నుంచి ఈ సేవలపై 5శాతం జీఎస్​టీని విధించనున్నట్లు కేంద్రం తెలిపింది. ఈ మేరకు జీఎస్​టీ నుంచి ఇ-కామర్స్ ఆటో రిక్షా సేవలకు ఉన్న మినహాయింపును తొలగిస్తున్నట్లు నవంబరు 18న కేంద్ర ఆర్థిక శాఖ పరిధిలోని రెవెన్యూ శాఖ ప్రకటించింది. అయితే.. ఆఫ్​లైన్​లో/సాధారణంగా అందించే ఆటో రిక్షా రవాణా సేవలపై ఈ జీఎస్​టీ వర్తించదని చెప్పింది.

"జీఎస్​టీలో ఈ సవరణ కారణంగా.. ఆన్​లైన్​ ద్వారా పెద్దఎత్తున వినియోగదారులకు ఆటో సేవలు అందిస్తున్న ఇ-కామర్స్​ రంగంలోని వ్యాపారులపై ప్రత్యక్ష ప్రభావం పడుతుంది. ప్రయాణికులకు రవాణా సేవలు అందించడంలో ఇ-కామర్స్ రంగం కీలక పాత్ర పోషిస్తోంది. తక్కువ ధరలో, సౌకర్యవంతమైన విధంగా రైడ్స్​ బుక్ చేసుకునేందుకు అవకాశం కల్పిస్తోంది. ఈ కొత్త నిబంధన కారణంగా.. ఆన్​లైన్​ రైడ్స్ బుక్ చేసుకునేవారికి ధరల భారం పడుతుంది" అని ఈవై ఇండియా ట్యాక్స్ పార్ట్​నర్​ బిపిన్ సప్రా చెప్పారు.

ఇదీ చూడండి: శాం​సంగ్ ఇండియాలో భారీగా ఉద్యోగ అవకాశాలు!

ఇదీ చూడండి: ఆసియాలో అత్యంత సంపన్నుడిగా గౌతమ్ అదానీ

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.