ETV Bharat / business

GST on Swiggy: స్విగ్గీ, జొమాటో సేవలపై జీఎస్​టీ? - జీఎస్​టీ కౌన్సిల్ మీటింగ్​ తేదీ

ఈ నెల 17న జరగనున్న సమావేశంలో జీఎస్​టీ కౌన్సిల్ (GST council meeting) మరో కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. జొమాటో, స్విగ్గీ వంటి ఆన్​లైన్​ ఫుడ్​ డెలివరీ సంస్థల సేవలను జీఎస్​టీ పరిధిలోకి తెచ్చే (GST on Swiggy) అంశంపై ఈసారి భేటీలో చర్చ జరగనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.

GST on Online Food deliver
ఆన్​లైన్​ ఫుడ్ డెలివరీకి జీఎస్​టీ
author img

By

Published : Sep 15, 2021, 7:29 PM IST

ఆన్‌లైన్‌లో తరచూ ఫుడ్​ ఆర్డర్‌ చేసే భోజన ప్రియులకు ఓ చేదు వార్త. ఫుడ్‌ డెలివరీ ఫ్లాట్‌ఫామ్స్‌ జొమాటో, స్విగ్గీ వంటి సంస్థల సేవలను త్వరలో వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ) కిందకి తీసుకువచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. శుక్రవారం (సెప్టెంబరు 17) జరిగే జీఎస్‌టీ సమావేశంలో ఈ ప్రతిపాదనపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారని సమాచారం. జీఎస్‌టీ కౌన్సిల్‌లోని ఫిట్‌మెంట్‌ కమిటీ ఇచ్చిన సూచనలపై చర్చించనున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం.

రెస్టారెంట్లు అందించే సేవలతో పాటు డోర్‌ డెలీవరీ, టేక్‌అవే, ఫుడ్‌ సర్వ్‌ చేయడం వంటి వాటిని జీఎస్‌టీ పరిధిలోకి తీసుకురావాలని కమిటీ సూచించింది. దీనిపై కమిటీ రెండు ప్రతిపాదనలు తీసుకువచ్చింది.

మొదటిది

యాప్‌ ఆధారిత ఈ-కామర్స్‌ ఆపరేటర్ల (ECO)ను 'డీమ్డ్‌ సప్లయర్స్'గా గుర్తిస్తూ రెండు కేటగిరీలుగా విభజించింది. ఇన్‌పుట్ క్రెడిట్ లేకుండా 5 శాతం, ఇన్‌పుట్ క్రెడిట్‌తో 18 శాతం పన్ను రేటుతో రెస్టారెంట్‌ నుంచి ఇకోకు పన్ను విధించడం. ఇకో నుంచి కస్టమర్‌కు 5 శాతం పరిమిత ఇన్‌పుట్ పన్ను క్రెడిట్‌ను విధించడం.

రెండవది

రెండో ప్రతిపాదనలో ఇకోలను అగ్రిగేటర్లుగా గుర్తించి తర్వాత రేట్‌ను ఫిక్స్‌ చేయడం. దీనివల్ల రెస్టారెంట్‌ అందించే అన్ని సేవలకు ఇకోలే జీఎస్‌టీ కట్టాల్సి ఉంటుంది. అయితే, ఈ పన్ను విధానం రూ.7,500 కంటే ఎక్కువ టారిఫ్‌లు ఉన్న హోటళ్లకు, రెస్టారెంట్లకు వర్తించకపోవచ్చు.

ఇదీ చదవండి: జీఎస్​టీ పరిధిలోకి పెట్రోల్​, డీజిల్! శుక్రవారం నిర్ణయం!!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.