ఫుడ్ ట్యాంపరింగ్ జరగకుండా ఇకపై ట్యాంపర్ ప్రూఫ్ ప్యాకింగ్ అందుబాటులోకి తెస్తున్నట్లు ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో ప్రకటించింది. మొదట దేశంలోని 10 నగరాల్లో ఈ విధానాన్ని అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపింది.
"పాలీమర్‌తో ఈ ప్యాకేజింగ్ ఉండనుంది. దీనిని పునర్వినియోగానికి, పునరుత్పత్తికి వినియోగించవచ్చు" అని జొమాటో ప్రకటించింది.
ఇది 100 శాతం ట్యాంపర్ ప్రూఫ్ ప్యాకింగ్‌గా కంపెనీ పేర్కొంది. ఒక సారి రెస్టారెంట్ ప్యాక్ చేసి ఇచ్చిన తర్వాత వినియోగదారుడు మాత్రమే ప్యాకింగ్ స్ట్రిప్‌ను కత్తిరించి.. తెరిచేలా ఈ విధానం ఉండనున్నట్లు జొమాటో వివరించింది.
మొదటి దశలో దిల్లీ, బెంగళూరు, కోల్‌కతా, హైదరాబాద్, పుణె, జైపూర్, చండీగఢ్, నాగ్‌పుర్, వడోదర పట్టణాల్లో అందుబాటులోకి తీసుకురానున్నట్లు కంపెనీ పేర్కొంది.
గతంలో జొమాటో డెలివరీ బాయ్ ఫుడ్ ట్యాంపరింగ్‌కు పాల్పడుతూ కెమెరాకు చిక్కిన ఘటన వైరల్‌గా మారింది. దీనిపై అప్పట్లో జొమాటోపై తీవ్ర విమర్శలు వచ్చాయి. జొమాటో తన తప్పును అంగీకరించింది.
ఫుడ్ డెలివరీలో మరింత పారదర్శకతను పెంచేందుకు ఈ నూతన ప్యాకేజింగ్ విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది ఆ సంస్థ.