Yezdi Bikes: ఒకప్పుడు కుర్రకారును విపరీతంగా ఆకర్షించిన యెజ్డీ బైక్స్ మళ్లీ వచ్చేశాయి. ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ క్లాసిక్ లెజెండ్స్.. మొత్తం 3 కొత్త మోడళ్లలో యెజ్డీ బ్రాండ్ బైక్స్‌ను విడుదల చేసింది. దిల్లీ ఎక్స్ షోరూంలో వీటి ధర రూ. 1.98- 2.09 లక్షల మధ్య ఉంది.
యెజ్డీ రోడ్‌స్టర్, యెజ్డీ స్క్రాంబ్లర్, యెజ్డీ అడ్వెంచర్ పేర్లతో మార్కెట్లోకి తీసుకొచ్చింది క్లాసిక్ లెజెండ్స్.
-
Today is not just Yezdi's rebirth, but of the #Yezdi rider too.
— yezdiforever (@yezdiforever) January 13, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
The phenomenon that birthed generations of bad boys and girls is ready to hit the roads once more!
Come witness first-hand, the return of an icon, today at 11:30 am - https://t.co/fYC7vb6UJH
.#YezdiIsBack pic.twitter.com/eZKdpgKXcv
">Today is not just Yezdi's rebirth, but of the #Yezdi rider too.
— yezdiforever (@yezdiforever) January 13, 2022
The phenomenon that birthed generations of bad boys and girls is ready to hit the roads once more!
Come witness first-hand, the return of an icon, today at 11:30 am - https://t.co/fYC7vb6UJH
.#YezdiIsBack pic.twitter.com/eZKdpgKXcvToday is not just Yezdi's rebirth, but of the #Yezdi rider too.
— yezdiforever (@yezdiforever) January 13, 2022
The phenomenon that birthed generations of bad boys and girls is ready to hit the roads once more!
Come witness first-hand, the return of an icon, today at 11:30 am - https://t.co/fYC7vb6UJH
.#YezdiIsBack pic.twitter.com/eZKdpgKXcv
3 కొత్త శ్రేణి యెజ్డీ ద్విచక్రవాహనాలు.. 334cc ఇంజిన్‌తోనే విడుదలయ్యాయి. అడ్వెంచర్ బైక్ 30.2 PS , రోడ్‌స్టర్ 29.7 PS, స్క్రాంబ్లర్ 29.1 PS పవర్‌ను ఉత్పత్తి చేయగలవు.
ఇప్పటికే జావా మోటార్ సైకిళ్లను రీటెయిల్ చేస్తున్న క్లాసిక్ లెజెండ్స్ డీలర్‌షిప్ నెట్‌వర్క్‌లో ఈ బైక్స్ అందుబాటులో ఉంటాయి.
యెజ్డీ బ్రాండ్ అంటే ఓ ఎమోషన్ అని అన్నారు క్లాసిక్ లెజెండ్స్ సహ వ్యవస్థాపకులు, ప్రముఖ నటుడు బొమన్ ఇరానీ.
మహీంద్రా అండతో..
ప్రముఖ కార్ల తయారీ కంపెనీ మహీంద్రా అండ్ మహీంద్రా 2016లో.. బైక్‌లు తయారుచేయాలని నిర్ణయించింది. క్లాసిక్ లెజెండ్స్‌తో ఒప్పందం కుదుర్చుకొని.. జావా బ్రాండ్ పేర్లతో దేశంలో బైక్‌లను విక్రయించింది.
క్లాసిక్ లెజెండ్స్‌లో మహీంద్రాకు 60 శాతం వాటా ఉంది. ఇప్పుడు అదే క్లాసిక్ లెజెండ్స్ యెజ్డీ బైక్‌లను మళ్లీ తీసుకొచ్చింది.
చాలా కాలం దూరంగా ఉన్న సోదరులు మళ్లీ కలిశారు అని జావా, యెజ్డీ బ్రాండ్ల ఫొటోలతో ట్విట్టర్లో ఓ పోస్ట్ చేశారు మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా.
ఇదీ చూడండి: కేటీఎం నుంచి సరికొత్త 'అడ్వెంచర్'.. ఫీచర్స్ అదుర్స్!