ETV Bharat / business

అనిల్​ అంబానీని 9 గంటలు ప్రశ్నించిన ఈడీ

author img

By

Published : Mar 19, 2020, 11:15 PM IST

ఎస్​ బ్యాంకు వ్యవస్థాపకుడు రాణా కపూర్​కు సంబంధించిన మనీలాండరింగ్​ కేసులో రిలయన్స్​ గ్రూపు అధినేత అనిల్​ అంబానీని 9గంటలు ప్రశ్నంచింది ఎన్​ఫోర్స్​మెంట్​ డైరెక్టరేట్​(ఈడీ). మార్చి 30న తిరిగి విచారణకు హాజరుకావాలని నోటీసులు జారీ చేసంది. రాజ్యసభ సభ్యుడు సుభాశ్​ చంద్రకూ సమన్లు జారీ చేసినట్లు అధికారులు తెలిపారు.

Yes Bank PMLA case: Anil Ambani questioned by ED for 9 hours, called again on March 30
అనిల్​ అంబానీని 9 గంటలు ప్రశ్నించిన ఈడీ

ఎస్ ​బ్యాంకు వ్యవస్థాపకుడు రాణా కపూర్​కు సంబంధించి మనీలాండరింగ్​ కేసులో రిలయన్స్​ గ్రూపు అధినేత అనిల్​ అంబానీని ఎన్​ఫోర్స్​మెంట్​ డైరెక్టరేట్​(ఈడీ) దాదాపు 9గంటల పాటు ప్రశ్నించింది. ఉదయం 9:30 గంటలకు బల్లార్డ్​ ఎస్టేట్‌లోని ఈడీ కార్యాలయానికి చేరుకున్న అంబానీని రాత్రి 7గంటల వరకు ప్రశ్నించారు. తదుపరి విచారణకు మార్చి 30న హాజరు కావాలని అధికారులు ఆదేశించారు. మనీలాండరింగ్​ నిరోధక చట్టం(పీఎంఎల్​ఏ)కింద అంబానీ వద్ద వాంగ్మూలం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.

ఎంపీకి సమన్లు..

పార్లమెంటు సమావేశాలు కారణంగా మార్చి 18న తొలిసారి విచారణకు హాజరు కాలేదు ఎస్సెల్ గ్రూప్​ చైర్మన్​, రాజ్యసభ ఎంపీ సుభాశ్​ చంద్ర. అయితే మార్చి 21 న విచారణకు హాజరు కావాలని తాజాగా సమన్లు ​​జారీ చేసింది ఈడీ.

ఎస్‌ బ్యాంకు నుంచి రిలయన్స్ గ్రూపు సంస్థలు సుమారు రూ.12,800 కోట్ల రుణాలను పొందాయి. సకాలంలో చెల్లించని కారణంగా అవి నిరర్ధక ఆస్తుల జాబితాలోకి చేరాయి. ఈ నేపథ్యంలోనే అనిల్ అంబానీని ఈడీ అధికారులు విచారించారు.

ఇదీ చూడండి: ఎస్​ బ్యాంక్ వివాదం: ఈడీ ఎదుట అనిల్ అంబానీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.