ETV Bharat / business

ఎస్​బీఐ సహా 7 బ్యాంకులకు రూ.10 వేల కోట్ల ఎస్​ బ్యాంకు షేర్లు

ఎస్​ బ్యాంకులో 49 శాతం వాటా కొనుగోలుకు సిద్ధమైన ఎస్​బీఐకి 605 కోట్ల షేర్లను రూ. 6,050 కోట్ల రూపాయలకు కేటాయించారు. ఎస్​బీఐతో సహా మరో 7 ప్రైవేటు బ్యాంకులకు 1,000 కోట్ల ఈక్విటీ షేర్లను రూ.10వేల కోట్లకు కేటాయించింది ఎస్​ బ్యాంకు.

yesbank crisis
ఎస్​ బ్యాంక్ సంక్షోభం
author img

By

Published : Mar 15, 2020, 6:45 PM IST

సంక్షోభంలో కూరుకుపోయిన ఎస్‌ బ్యాంకు... 1000 కోట్ల ఈక్వీటీ షేర్లను ఎస్​బీఐ సహా 7 ప్రైవేట్​ బ్యాంకులకు కేటాయించింది. రూ.10,000 కోట్లకు ఈ షేర్లను ఇచ్చింది.

ఎస్​ బ్యాంక్​లో రూ.250 కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్లు ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్‌ ప్రకటించింది. ఎస్​ బ్యాంక్​లో ప్రైవేటు బ్యాంకుల పెట్టుబడులు ఇప్పటికే రూ.3,950 కోట్లకు చేరుకున్నాయి.

సుమారు 395 కోట్ల ఈక్విటీ షేర్లను ప్రైవేటు పెట్టుబడిదారులకు కేటాయించినట్లు ఎస్​ బ్యాంకు పేర్కొంది. ఒక్కో ఈక్విటీ షేరుకు రూ.10 ముఖ విలువ, రూ. 8 ప్రీమియంతో షేర్​ ధరను లెక్కించనున్నట్లు తెలిపింది.

ఎస్​బీఐకి కేటాయింపు...

ఎస్​ బ్యాంకులో 49 శాతం వాటా కొనుగోలుకు సిద్ధమైన ఎస్​బీఐకి.. 605 కోట్ల షేర్లను రూ.6,050 కోట్ల రూపాయలకు కేటాయించారు. ఎస్​ బ్యాంక్​ కోసం రిజర్వ్​ బ్యాంకు ప్రతిపాదించిన పునరుజ్జీవ ప్రణాళిక కింద మార్చి 14 నుంచి మూడేళ్లు పూర్తయ్యే వరకు ఎస్​బీఐ.. తన వాటాను 26 శాతానికి తగ్గించేందుకు వీలుండదు.

భారీ పెట్టుబడులు...

ఎస్​ బ్యాంకులో ఇప్పటికే రూ.7,250 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు ఎస్‌బీఐ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే సెంట్రల్​ ఎగ్జిక్యూటివ్​ కమిటీ (ఈసీసీబీ) ఎస్​ బ్యాంకులో 725 కోట్ల షేర్లను రూ.10 చొప్పున కొనుగోలు చేసేందుకు గురువారం ఆమోదం తెలిపింది.

పెట్టుబడుల వివరాలు..

  • హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ బ్యాంకులు కూడా చెరో రూ.1,000 కోట్లు
  • యాక్సిస్‌ బ్యాంక్‌ రూ.600 కోట్లు
  • కోటక్‌ మహీంద్రా బ్యాంకు రూ.500 కోట్లు
  • ఫెడరల్​ బ్యాంకు, బంధన్‌ బ్యాంకు ఒక్కొక్కటి రూ.300 కోట్ల చొప్పున పెట్టుబడి పెట్టేందుకు సంసిద్ధతను వ్యక్తం చేశాయి.

మరోవైపు ఎస్‌ బ్యాంకుపై ఈ నెల 5న విధించిన మారటోరియాన్ని 18న ఎత్తివేయనున్నట్లు ఆర్బీఐ ఇప్పటికే ప్రకటించింది. దీని ప్రకారం ఆర్బీఐ ప్రతిపాదించిన ఎస్‌బ్యాంకు పునరుజ్జీవ ప్రణాళిక-2020 అమల్లోకి వస్తుంది.

మాజీ ఎస్​బీఐ సీఎఫ్​ఓ, ప్రస్తుత ఎస్​ బ్యాంకు నిర్వాహకుడు ప్రశాంత్​ కుమార్​ సంస్థ మేనేజింగ్​ డైరెక్టర్, సీఈఓగా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది.

ఇదీ చూడండి:మదుపరులు ఏ షేర్లు కొంటే లాభదాయకం?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.