దేశీయ ఐటీ దిగ్గజం విప్రో షేర్లు బుధవారం భారీగా పుంజుకున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో రూ.2,387.6 కోట్ల ఏకీకృత లాభాన్ని ప్రకటించిన నేపథ్యంలో కంపెనీ షేర్ల కొనుగోలుకు మదుపరులు మొగ్గు చూపుతున్నారు.
2020-21 క్యూ1లో కంపెనీ ఆదాయం గత ఆర్థిక సంవత్సరం ఇదే సమయంతో పోలిస్తే రూ.15,566.6 కోట్ల నుంచి రూ.15,571.4 కోట్లకు పెరిగింది.
వీటికి తోడు కరోనా సంక్షోభం ఉన్నా విప్రో పనితీరుపై బ్రోకరేజి సంస్థలు సానుకూల అంచనాలు వెల్లడిస్తుండటం వల్ల మదుపురుల సెంటిమెంట్ బలపడినట్లు తెలుస్తోంది.
ఇటీవల దేశీయ అతిపెద్ద టెక్ దిగ్గజం టీసీఎస్ ఫలితాల్లో నిరాశపరిచిన విషయం తెలిసిందే.
బీఎస్ఈలో విప్రో షేరు 15 శాతం పెరిగి రూ.259.85 వద్ద ఉంది.
ఎన్ఎస్ఈలో సంస్థ షేరు 15.58 శాతం పెరిగింది. ఒక షేరు ధర ఇందులో రూ.260.05 వద్ద ఉంది.
ఇదీ చూడండి:హువావేపై బ్రిటన్ నిషేధం.. అమెరికా హర్షం