గడిచిన ఆర్థిక సంవత్సరం (2019-20)లో చివరి త్రైమాసికం (జనవరి-మార్చి)లో దేశీయ ఐటీ దిగ్గజం విప్రో లాభాలు 6 శాతం తగ్గాయి. గడిచిన మూడు నెలల కాలంలో మొత్తం రూ.2,345.2 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని గడించింది విప్రో.
ఆదాయం వృద్ధి..
2019-20 క్యూ4లో ఆదాయం మాత్రం 4.6 శాతం పెరిగినట్లు విప్రో వెల్లడించింది. జనవరి-మార్చి మధ్య రూ.15,711 కోట్లు ఆర్జించినట్లు తెలిపింది. అంతకు ముందు ఆర్థిక సంవత్సరం (2018-19) ఇదే సమయంలో సంస్థ ఆదాయం రూ.15,006.3 కోట్లుగా ఉండటం గమనార్హం.
కరోనా నేపథ్యంలో నెలకొన్న పరిస్థితులతో గడిచిన ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో 14-16 మిలియన్ డాలర్ల ఆదాయం తగ్గిందని విప్రో పేర్కొంది.
ఇదీ చూడండి:మార్చిలో దిగొచ్చిన టోకు ద్రవ్యోల్బణం