దేశీయ ఐటీ దిగ్గజం విప్రో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో నికర లాభం 2.17 శాతం తగ్గినట్లు ప్రకటించింది. 2019-20 క్యూ3లో మొత్తం రూ.2,455.9 కోట్ల నికర లాభం గడించినట్లు ఫైలింగ్‌లో పేర్కొంది.
గత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో రూ.2,510.4 కోట్ల నికర లాభాన్ని గడించింది విప్రో.
ఆదాయం మాత్రం ప్రస్తుత ఆర్థిక సంవత్సర క్యూ3లో 2.7 శాతం పెరిగి రూ.15,470.5 కోట్లు గడించినట్లు విప్రో వెల్లడించింది. 2018-19 మూడో త్రైమాసికంలో విప్రో ఆదాయం రూ.15.059.5 కోట్లుగా ఉంది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మార్చితో ముగిసే త్రైమాసికానికి (చివరి త్రైమాసికం) 2,095 మిలియన్ డాలర్ల నుంచి 2,137 మిలియన్ డాలర్ల ఆదాయన్ని అశిస్తున్నట్లు తెలిపింది విప్రో.
ఐటీ సేవల సెగ్మెంట్లో డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికానికి 2,094.8 మిలియన్ డాలర్ల ఆదాయాన్ని గడించింది ఈ సంస్థ.
ఇదిలా ఉండగా ఒక్కో ఈక్విటీ షేర్‌కు రూ.1 (0.014 డాలర్లు) మధ్యంతర డివిడెండ్ ప్రకటించింది విప్రో.
ఇదీ చూడండి:పండుగ వేళ దిగొచ్చిన పసిడి, వెండి ధరలు