ETV Bharat / business

వేదాంతా డీ- లిస్టింగ్‌ ఎందుకు విఫలమైంది? - వేదాంతా లిమిటెడ్​ షేరు ధర

వేదాంతా లిమిటెడ్​ షేరు ధర సోమవారం ఏకంగా 20 శాతం పతనమైంది. అందుకు ప్రధాన కారణం డీ లిస్టింగ్​ ప్రక్రియ విఫలం కావటమే. ఇంతకీ వేదాంతా డీ లిస్టింగ్​ ఎందుకు విఫలమైంది?.. కారణాలు ఏంటి?.

Vedanta
వేదాంతా లిమిటెడ్
author img

By

Published : Oct 13, 2020, 7:05 AM IST

అనిల్‌ అగర్వాల్‌కు చెందిన వేదాంతా లిమిటెడ్‌ షేరు ధర 5 రోజుల క్రితం రూ.136. కానీ సోమవారం స్టాక్‌ఎక్స్ఛేంజీలో ఈ షేరు ముగింపు ధర రూ.96.95. అయిదు రోజుల్లో ఇంత భారీగా వేదాంతా షేరు ధర పతనం కావటానికి ప్రధాన కారణం- డీలిస్టింగ్‌ ప్రక్రియ వెనక్కి పోవటమే. సోమవారం ఒక్కరోజు ఈ షేరు 20% పతనమైంది. ఒకపక్క కంపెనీకి రుణభారం అధికంగా ఉండటం, మరోపక్క డీలిస్టింగ్‌ ప్రక్రియ విఫలం కావటంతో మదుపర్లు ఈ షేర్‌ను విక్రయించినట్లు స్పష్టమవుతోంది.

ఇంతకీ వేదాంతా డీ-లిస్టింగ్‌ ఎందుకు విపలమైంది అంటే, దీనికి ఎన్నో కారణాలు కనిపిస్తున్నాయి.

  • స్టాక్‌మార్కెట్లో నమోదైన (లిస్టింగ్‌)ఏదైనా ఒక కంపెనీ, ఆ లిస్టింగ్‌ రద్దు చేసుకుని బయటకు రావడాన్నే డీ-లిస్టింగ్‌ అంటారు. అది జరగాలంటే కంపెనీ జారీ చేసిన షేర్లలో కనీసం 90% షేర్లను వెనక్కి కొనుగోలు చేయాలి. డీ-లిస్టింగ్‌ కోసం వేదాంతా యాజమాన్యం వాటాదార్ల నుంచి 169.73 కోట్ల షేర్లు వెనక్కి కొనుగోలు చేయడానికి ముందుకు వచ్చింది. కానీ వాటాదార్లు 125.47 కోట్ల షేర్లు మాత్రమే ఇచ్చేందుకు ముందుకు వచ్చారు. ఈ ప్రక్రియ విజయవంతం కావాలంటే నిర్దేశించుకున్న షేర్లలో 90% షేర్లు (134 కోట్ల షేర్లు) రావాలి. అందువల్ల ఈ వ్యవహారం వెనక్కి పోయింది.
  • వాస్తవానికి 137.78 కోట్ల షేర్లకు బిడ్లు దాఖలయ్యాయి. కానీ అందులో 125.47 కోట్ల షేర్లకు మాత్రమే అర్హత లభించింది. మిగిలిన 12.3 కోట్ల షేర్లకు సంబంధించిన బిడ్లు ఇన్‌వాలిడ్‌ అయ్యాయి. దీంతో కనీసం 90 శాతం షేర్లు రానట్లయింది.
  • ఈ కంపెనీలో వాటాదార్లుగా ఉన్న దేశీయ సంస్థల్లో ఎల్‌ఐసీ ఒకటి. వేదాంతాలో ఎల్‌ఐసీకి 6.37% వాటా ఉంది. వేదాంతా డీ-లిస్టింగ్‌ ప్రక్రియలో పాల్గొనేందుకు ఎల్‌ఐసీ ఇష్టపడలేదని తెలుస్తోంది. ఈ షేర్‌కు రూ.140 విలువ ఉంటుందనే అభిప్రాయం మార్కెట్‌ వర్గాల్లో ఉండగా, ఎల్‌ఐసీ మాత్రం కనీసం రూ.320 విలువ ఉన్నట్లు భావిస్తోంది.
  • డీ-లిస్టింగ్‌ ప్రక్రియలో భాగంగా రివర్స్‌ బుక్‌-బిల్డింగ్‌ పద్ధతిలో వాటాదార్లు తమ షేర్లను కంపెనీకి తిరిగి ఇచ్చే ప్రక్రియ ఈ నెల 5న ప్రారంభమై, 9న ముగిసింది. ఒక్కోషేర్‌కు కనీస ధర రూ.87.25 నిర్ణయించారు. వాస్తవిక విలువ కంటే ఈ ధర ఎంతో తక్కువగా ఉందనే ఉద్దేశంతో షేర్లు ఇవ్వటానికి ఎక్కువ మంది వాటాదార్లు ఆసక్తి చూపలేదని స్పష్టమవుతోంది. దీంతో ప్రస్తుతానికి డీ-లిస్టింగ్‌ ప్రతిపాదనను విరమించుకుని, ఇప్పటికే దాఖలైన షేర్లను సంబంధిత వాటాదార్లకు వెనక్కి తిరిగి ఇవ్వటానికి కంపెనీ సిద్ధమవుతోంది.

6 నెలలు ఆగాల్సిందే

మరోసారి ఇదే ప్రక్రియ చేపట్టాలంటే...నిబంధనల ప్రకారం కనీసం 6 నెలల గడువు ఉండాలి. ఆ తర్వాతే మళ్లీ డీ-లిస్టింగ్‌ వ్యవహారం చేపట్టడానికి వీలవుతుంది. దీని ప్రకారం వేదాంతా యాజమాన్యం ఇప్పటికిప్పుడు మరోసారి ఇటువంటి ప్రయత్నాన్ని చేపట్టే అవకాశం లేదు. ఈ పరిస్థితుల్లో మదుపరులు ఏం చేయవచ్చు...? దేశీయ స్టాక్‌మార్కెట్లో నమోదైన కంపెనీల్లో ఏటా అత్యధికంగా డివిడెండ్‌ చెల్లించే కంపెనీల్లో వేదాంతా ఒకటి. 'డివిడెండ్‌ ఈల్డ్‌' ఎంతో ఆకర్షణీయంగా ఉండటం, భవిష్యత్తులో లోహాల తయారీ కంపెనీలకు లాభాలు బాగా పెరగవచ్చనే అభిప్రాయం ఉన్నందున వేదాంతా షేర్‌ ధర మళ్లీ పెరగవచ్చని స్టాక్‌మార్కెట్‌ నిపుణులు భావిస్తున్నారు.

ఇదీ చూడండి: 40 కోట్ల సబ్​స్క్రైబర్స్​ మార్క్​ దాటిన తొలిసంస్థగా 'జియో'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.