కొత్త ఫీచర్లు తీసుకురావడంలో సంక్షిప్త సందేశాల దిగ్గజం వాట్సాప్ ఎప్పుడూ ముందుంటుంది. ఇందులో భాగంగా ఇన్స్టాగ్రామ్ తరహాలోనే 'బూమరాంగ్' ఫీచర్‌ను తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. టెక్ వర్గాల ప్రకారం ప్రస్తుతం ఈ ఫీచర్ టెస్టింగ్ దశలో ఉంది. మరి కొన్ని నెలల్లో ఆండ్రాయిడ్, ఐఓఎస్ ఫోన్లలో అందుబాటులోకి రావచ్చు. ఇప్పటికే ఇన్‌స్టాగ్రామ్‌లో ఉన్న 'బూమరాంగ్' ఫీచర్‌తో పోలిస్తే వాట్సాప్ బూమరాంగ్ భిన్నంగా ఉండనుంది.
రెండింటికి తేడా ఏంటంటే...
ఇన్‌స్టాగ్రామ్‌లో ఉన్న ఫీచర్‌తో కొత్త వీడియోలను మాత్రమే 'బూమరాంగ్' మోడ్‌లో చిత్రీకరించవచ్చు. వాట్సాప్ తీసుకువస్తున్న కొత్త సదుపాయంతో ఫోన్లో ముందే ఉన్న వీడియోలనూ ఏడు సెకన్లపాటు 'బూమరాంగ్' వీడియోగా మార్చుకునేందుకు వీలుంటుంది. గ్రూప్, వ్యక్తికత చాట్... రెండింటిలోనూ ఈ ఫీచర్ అందుబాటులో ఉండనుంది.
డార్క్‌మోడ్ సిద్ధం!
డార్క్‌మోడ్ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు వాట్సాప్ ఇప్పటికే ప్రకటించింది. ఐఓఎస్ ఫోన్లకు ఈ ఫీచర్ మొదటగా అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది. వాట్సాప్ ఐఓఎస్ డార్క్‌మోడ్ 95 శాతం సిద్ధమైనట్లు టెక్ వర్గాల సమాచారం. ఆండ్రాయిడ్ యూజర్లకు ఈ ఫీచర్ కాస్త ఆలస్యమయ్యే అవకాశం ఉంది.
ఇదీ చూడండి: అప్పుల భారం తగ్గించే పనిలో 'కాఫీ డే'