ETV Bharat / business

ఏడాదిలో వాట్సాప్ పేమెంట్ సేవలు - ఫోన్ పే

పేమెంట్ సేవలను పూర్తి స్థాయిలో వినియోగంలోకి తెచ్చేందుకు సిద్ధమైంది వాట్సాప్. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ట్రయల్ పేమెంట్ సర్వీసు ఈ నెలాఖరుకు పూర్తికానుంది. ఈ ఏడాది చివరి నాటికి పూర్తి స్థాయిలో యూజర్లందరికి పేమెంట్ సేవలందించాలని భావిస్తున్నట్లు వాట్సాప్ అంతర్జాతీయ అధినేత విల్​ క్యాత్​కర్ట్ వెల్లడించారు.

వాట్సాప్
author img

By

Published : Jul 25, 2019, 6:15 PM IST

ఈ ఏడాది చివరినాటికి భారత యూజర్లందరికి పేమెంట్​ సేవలు అందుబాటులోకి తీసుకురానుంది వాట్సాప్. సంస్థ అంతర్జాతీయ అధిపతి విల్ క్యాత్​కర్ట్​ ​ఈ విషయాన్ని వెల్లడించారు. భారత పర్యటనలో ఉన్న ఆయన పలు విషయాలను యూజర్లతో పంచుకున్నారు.

వాట్సాప్​నకు భారత్​లో 400 మిలియన్ల మంది వినియోగదారులు ఉన్నారు. దాదాపు 10 లక్షల యూజర్లపై ఏడాది కాలంగా పేమెంట్ సేవల ట్రయల్​ నిర్వహిస్తోంది.
వాట్సాప్​లో సందేశాలు ఎంత సులభంగా పంపగలుగుతారో అంతే సులభంగా లావాదేవీలు జరిపేలా చేయడమే కంపెనీ లక్ష్యమని క్యాత్​కర్ట్ పేర్కొన్నారు.

"ఈ లక్ష్యాన్ని విజయవంతంగా అందుకోగలిగితే ఆర్థిక లావాదేవీలు భారీగా పెరుగుతాయి. భారత్​లో వేగంగా వృద్ధి చెందుతున్న డిజిటల్ లావాదేవీలకు ఇది మరింత తోడ్పడుతుంది."
-విల్​ క్యాత్​కర్ట్, వాట్సాప్ అంతర్జాతీయ అధిపతి

పేమెంట్ దిగ్గజాలకు పోటీ

వాట్సాప్​ పేమెంట్ సేవలు పూర్తిగా అందుబాటులోకి వస్తే.. ఇప్పటికే ఆ రంగంలో దూసుకెళ్తున్న పేటీఎం, ఫోన్​ పే, గూగుల్ పే వంటి సంస్థలకు గట్టి పోటీ ఎదురవనుంది.

అన్ని అనుమతులు వచ్చాకే..

భారత్​లో పేమెంట్ సేవలను ప్రతిష్ఠాత్మకంగా ఆవిష్కరించింది వాట్సాప్. అయితే లావాదేవీల డాటా స్టోరేజీపై వివాదాల్లో చిక్కుకుంది. ఈ కారణంగా గత ఏడాది అక్టోబర్​లో భారత్​లోనే లావాదేవీల స్టోరేజీ వ్యవస్థ ఏర్పాటు చేసినట్లు పేర్కొంది.

జూలైతో వాట్సాప్ పేమెంట్స్ సేవల ట్రయల్ పూర్తవుతుంది. రిజర్వు బ్యాంకు నుంచి అన్ని అనుమతులు పొందిన తర్వాతే పేమెంట్ సేవలను పూర్తి స్థాయిలో ఆవిష్కరించనున్నట్లు ఈ ఏడాది మేలో స్పష్టం చేసింది వాట్సాప్.

ఇదీ చూడండి: ఆగస్టు 1న హువావే "వై9 ప్రైమ్ 2019"

AP Video Delivery Log - 0900 GMT News
Thursday, 25 July, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0857: China MOFA Briefing AP Clients Only 4222053
DAILY MOFA BRIEFING
AP-APTN-0846: ARCHIVE ASAP Rocky AP Clients Only 4222056
Rapper A$AP Rocky charged with assault over fight in Sweden
AP-APTN-0832: Afghanistan Blast 2 AP Clients Only 4222054
Afghan capital hit by 3 bombings, at least 8 killed
AP-APTN-0822: China Landslide No Access Mainland China 4222051
Death toll rises to 15 in southwest China landslide
AP-APTN-0748: France Flying Man AP Clients Only 4222046
Frenchman's attemps to fly across channel
AP-APTN-0745: Puerto Rico Celebrations 2 AP Clients Only 4222045
Protesters celebrate after governor says he'll quit
AP-APTN-0704: Malaysia Rail Link Relaunch AP Clients Only 4222044
China backed Malaysian rail project back on track
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.