ఆదానీ గ్రూప్‌నకు నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్ (ఎన్ఎస్డీఎల్) భారీ షాకిచ్చినట్టు తెలిసింది. ఆ సంస్థలో దాదాపు రూ.43,500 కోట్ల పెట్టుబడులు ఉన్న మూడు ఫారిన్ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్ట్మెంట్ల (ఎఫ్‌పీఐ) ఖాతాలను నిపివేసినట్లు సమాచారం. దీనితో సంస్థ షేర్లు భారీగా కుదేలవుతున్నాయి. అదానీ ఎంటర్ప్రైజెస్ షేరు విలువ దాదాపు 25 శాతం పతనమైంది. గ్రూప్‌లోని ఇతర కంపెనీల షేర్లు భారీగా నష్టపోయి.. లోవర్ సర్క్యూట్‌ను తాకాయి.
కారణాలు ఏమిటి?
ప్రివెన్షన్ ఆఫ్ మనీ ల్యాండరింగ్ యాక్ట్ (పీఎంఎల్ఏ) ప్రకారం అవసరమైన సమాచారం సమర్పించకపోవడమే ఆయా సంస్థల ఖాతాలు నిలిపివేతకు కారణంగా తెలిసింది. ఖాతాల నిలిపివేత మే 31 కన్నా ముందే జరిగినట్లు సమాచారం.
అయితే నెట్టింట మాత్రం అదానీ షేర్లు పతనమయ్యేందుకు అసలు కారణం వేరేలా ఉన్నాయంటూ ప్రచారం జరుగుతోంది. హర్షద్ మెహతా స్టాక్ మార్కెట్ కుంభకోణం బయటపడటంలో ముఖ్య భూమిక పోషించిన మహిళా జర్నలిస్ట్ సుచేత దలాల్ చేసిన ట్వీట్ ఇందుకు కారణమని జోరుగా చర్చ జరుగుతోంది.
ఆ ట్వీట్లో ఏముంది?
సెబీ నిఘా వ్యవస్థలు గుర్తించలేని స్థాయిలో మరో కుంభకోణం జరుగుతోందని సుచేతా దలాల్ ఇటీవల ట్వీట్ చేశారు. విదేశీ సంస్థల ద్వారా ఇది జరుగుతున్నట్లు పేర్కొన్నారు. కంపెనీ పేరును నేరుగా చెప్పకపోయినప్పటికీ.. దలాల్ చేసిన ట్వీట్లు అదానీ గ్రూప్‌ను ఉద్దేశించేనని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
-
Another scandal hard to prove outside the black box of information available with SEBI tracking systems is the return of an operator of the past who is relentlessly rigging prices of one group. All through foreign entities! His speciality & that of a former FM. Nothing changes!
— Sucheta Dalal (@suchetadalal) June 12, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">Another scandal hard to prove outside the black box of information available with SEBI tracking systems is the return of an operator of the past who is relentlessly rigging prices of one group. All through foreign entities! His speciality & that of a former FM. Nothing changes!
— Sucheta Dalal (@suchetadalal) June 12, 2021Another scandal hard to prove outside the black box of information available with SEBI tracking systems is the return of an operator of the past who is relentlessly rigging prices of one group. All through foreign entities! His speciality & that of a former FM. Nothing changes!
— Sucheta Dalal (@suchetadalal) June 12, 2021
అయితే విదేశీ పెట్టుబడి సంస్థల ఖతాల నిలిపివేత సహా.. ప్రస్తుతం జరుగుతున్న ప్రచారం గురించి ఆదానీ గ్రూప్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.
ఇదీ చదవండి: అదానీ షేర్ల పతనం పూర్తి వివరాలు..