ETV Bharat / business

'జాతి సమానత్వం కోసం గూగుల్​, యూట్యూబ్​ మద్దతు' - racial equality support

ఆఫ్రికన్ అమెరికన్​ జార్జి​ ఫ్లాయిడ్ మృతిని నిరసిస్తూ అమెరికాలో ఆందోళనలు మిన్నంటాయి. జాతి సమానత్వం కోసం ఈ నిరసనలకు మద్దతు తెలిపారు గూగుల్, ఆల్ఫాబెట్ సీఈవో సుందర్​ పిచాయ్. నిరసనకారులకు సంఘీభావం తెలుపుతూ యూఎస్​ యూట్యూబ్​, గూగుల్ హోం పేజ్​​లలో ఆదివారం బ్లాక్​ రిబ్బన్​తో సందేశాన్ని ఉంచారు.

We share our support for racial equality: Sundar Pichai
'జాతి సమానత్వం కోసం మద్దతుగా ఉంటాం'
author img

By

Published : Jun 1, 2020, 1:50 PM IST

నల్లజాతీయుడు జార్జి ప్లాయిడ్​ మృతి అనంతరం అమెరికా నిరసనలతో అట్టుడుకుతోంది. ఆందోళనకారుల ఆగ్రహ జ్వాలలు దేశమంతటా వ్యాపించాయి. ఈ నిరసనలకు గూగుల్​, యూట్యూబ్​లు మద్దతు తెలిపాయి. హోంపేజ్​లో నల్లరంగు బ్యాడ్జీలతో సందేశాన్ని ప్రదర్శించాయి.

'జాతి సమానత్వం కోసం జరగుతున్న ఆందోళనలకు, దాని కోసం అన్వేషిస్తోన్న వారికి మద్దతుగా ఉంటాం' అని గూగుల్​ హోంపేజ్​లో ఆదివారం సందేశం ఉంచారు. ఇదే సందేశాన్ని యూఎస్​ యూట్యూబ్​ హోంపేజ్​లోనూ ప్రదర్శించారు.

ఆల్ఫాబెట్​, గూగుల్ సీఈవో సందర్ పిచాయ్ ఈ విషయంపై స్పందిస్తూ ట్వీట్​ చేశారు.

  • Today on US Google & YouTube homepages we share our support for racial equality in solidarity with the Black community and in memory of George Floyd, Breonna Taylor, Ahmaud Arbery & others who don’t have a voice. For those feeling grief, anger, sadness & fear, you are not alone. pic.twitter.com/JbPCG3wfQW

    — Sundar Pichai (@sundarpichai) May 31, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"జాతి సమానత్వం కోసం జరుగుతున్న నిరసనలకు గూగుల్​, యూట్యూబ్​ హోం పేజ్​ల ద్వారా మద్దతు తెలుపుతున్నాం. నల్లజాతీయులకు, జార్జి ఫ్లాయిడ్​, బ్రియన్నా టేలర్​, అహ్మౌద్ అర్బెరీ సహా గళం విప్పలేని ఇతరులకు సంఘీభావం తెలుపుతున్నాం. దుఃఖం, ఆగ్రహం, విచారం, భయంతో ఉన్న మీరంతా ఒంటరి కాదు"

-సుందర్​ పిచాయ్, గూగుల్​ సీఈఓ

మానవత్వానికే మచ్చ తెచ్చే సంఘటన అమెరికాలో గతవారం జరిగింది. జార్జి​ ఫ్లాయిడ్​ మెడను ఓ కర్కశ పోలీసు మోకాలితో తొక్కిపెట్టడం వల్ల ఊపిరాడక గిజగిజలాడిపోయి చివరకు మరణించాడు. ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్​ అయ్యాయి. ప్రజల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఇంకెన్నాళ్లు ఈ జాత్యహంకారం అని అమెరికా వ్యాప్తంగా తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

ఇదీ చదవండి: పోలీసు కర్కశం- నల్లజాతీయుడిని మోకాలుతో తొక్కిపట్టి..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.