ETV Bharat / business

భారత్​లోకి వాల్​మార్ట్.. వయా ఫ్లిప్​కార్ట్ - walmart to be entering into bharat by flipkart

భారత ఈ- కామర్స్​లోకి వచ్చేందుకు అమెరికా రిటైల్ దిగ్గజం వాల్​మార్ట్ యత్నాలు ముమ్మరం చేసింది. ఫ్లిప్​కార్ట్​ ద్వారా దేశీయ విపణిలోకి ప్రవేశించాలని చూస్తోంది. ఈ మేరకు ఫ్లిప్​కార్ట్ సీఈవో కల్యాణ్ కృష్ణమూర్తి ప్రకటన విడుదల చేశారు.

walmart
భారత వాల్​మార్ట్.. వయా ఫ్లిప్​కార్ట్
author img

By

Published : Jul 15, 2020, 5:32 AM IST

భారత ఈ-కామర్స్‌ రంగంలో దూసుకుపోతున్న అమెజాన్, జియోమార్ట్‌కు గట్టి పోటీ ఇచ్చేందుకు అమెరికా రిటైల్‌ దిగ్గజం వాల్‌మార్ట్‌...ఫ్లిప్‌కార్ట్‌లో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమైంది. ఫ్లిప్‌కార్ట్‌లో 1.2 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టనున్నట్లు వాల్‌మార్ట్ తెలిపింది. రెండేళ్ల క్రితం 16 బిలియన్ డాలర్ల విలువైన మెజారిటీ వాటాను 24.9 బిలియన్‌ డాలర్ల పోస్ట్‌ మనీగా వాల్‌ మార్ట్‌ కొనుగోలు చేసింది. అప్పుడు ఫ్లిప్‌కార్ట్ విలువ 20.8 బిలియన్ డాలర్లుగా ఉంది.

దేశంలోని 20 కోట్ల దుకాణదారులను ఆన్‌లైన్‌లోకి తీసుకురావడానికి కంపెనీ ప్రయత్నిస్తోందని ఫ్లిప్‌కార్ట్‌ సీఈవో కల్యాణ్‌ కృష్ణమూర్తి తెలిపారు. రిటైల్‌ రంగంలో దూసుకుపోతున్న జియోమార్ట్‌ను ఎదుర్కొనేందుకు ఫ్లిప్‌కార్ట్ మూలధన సమీకరణను మరింతగా పెంచుకుంటోంది.

ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద ఇంటర్నెట్ మార్కెట్‌గా ఉన్న భారత్‌...కోవిడ్ సంక్షోభం నుంచి కోలుకునేందుకు చర్యలు ప్రారంభించడంతో దేశంలోని తన ఈ-కామర్స్ మార్కెట్‌ను మరింతగా పెంచుకోవడానికి తాజా మూలధనం సహాయపడుతుందని ఫ్లిప్‌కార్ట్ పేర్కొంది.

ఇదీ చూడండి: రిలయన్స్ ఏజీఎంలో ఈ సారి కీలక ప్రకటనలు ఇవే!

For All Latest Updates

TAGGED:

walmart
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.