ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ అమెరికాలో త్వరలో ఐపీఓకు వెళ్లేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. 10 బిలియన్ డాలర్లను సమీకరించాలనే లక్ష్యంతో వాల్‌మార్ట్ సంస్థ ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే గోల్డ్‌మన్ శాక్స్ సంస్థను ఈ వ్యవహారాలను చూసేందుకు నియమించుకుంది. ఐపీఓ ద్వారా ఫ్లిప్‌కార్ట్‌లో 25 శాతం వాటాలను విక్రయించవచ్చని భావిస్తున్నారు విశ్లేషకులు.
ఇదే సరైన సమయం!
తాజాగా కరోనా వైరస్ వ్యాప్తితో మిగిలిన వ్యాపారాల కంటే ఈ-కామర్స్ బాగుండటం వల్ల ఇప్పుడు షేర్లు విక్రయిస్తే మంచి ధర లభించే అవకాశం ఉంది. దీనితో వాల్‌మార్ట్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఇదీ చూడండి:జనవరి 31లోపు అందరికీ రీఫండ్: ఇండిగో