స్టాక్ మార్కెట్లు ఒడుదొడుకుల్లో ఉన్నా.. శుక్రవారం సెషన్లో వొడాఫోన్ ఐడియా షేర్లు మాత్రం భారీగా పుంజుకున్నాయి. భారతీయ వ్యాపారాల్లో తీవ్ర సంక్షోభంలో చిక్కుకున్న వొడాఫోన్‌లో గూగుల్ 5 శాతం వాటా కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నట్లు వస్తున్న వార్తలతో సంస్థ షేర్లు దాదాపు 30 శాతం లాభంతో ట్రేడవుతున్నాయి.
బీఎస్ఈలో వొడాఫోన్ ఐడియా షేర్లు 29.89 శాతం పెరిగాయి. ఒక షేరు ధర ప్రస్తుతం రూ.7.56 వద్ద ఉంది. ఎన్ఎస్ఈలో 25 శాతం వృద్ధి చెందిన సంస్థ షేరు విలువ రూ.7.25 వద్దకు చేరింది.
విప్రో షేర్లు 4 శాతం వృద్ధి..
ఐటీ దిగ్గజం విప్రో షేర్లు కూడా శుక్రవారం సెషన్లో 4 శాతానికిపైగా లాభంతో ట్రేడవుతున్నాయి. సంస్థ కొత్త సీఈఓ, ఎండీగా థియర్రీ డెలపొర్టేను నియమించుకుంటున్నట్లు విప్రో చేసిన ప్రకటన ఇందుకు కారణంగా తెలుస్తోంది.
విప్రో షేరు ధర ప్రస్తుతం.. బీఎస్ఈలో రూ.206.75, ఎన్ఎస్ఈలో రూ.206.80 వద్ద ఉంది.
ఇదీ చూడండి:వొడాఫోన్‌లో గూగుల్ పెట్టుబడి వార్తలపై పూర్తి సమాచారానికి ఇక్కడ క్లిక్ చేయండి