యాపిల్ వాచ్‌ల్లో శుక్రవారం నుంచి సెల్యూలర్ సేవలను ప్రారంభించింది వొడాఫోన్ ఐడియా. అయితే కొన్ని ఎంపిక చేసిన సర్కిళ్లలోనే ఈ సెల్యూలర్, జీపీఎస్ సేవలను అందుబాటులోకి తెచ్చినట్లు స్పష్టం చేసింది.
"ఈ సదుపాయంతో వినియోగదారులు ఫోన్ అవసరం లేకుండానే యాపిల్ వాచ్‌ను ఉపయోగించుకోవచ్చు. ముంబయి, దిల్లీ, గుజరాత్ సర్కిళ్లలో శుక్రవారం నుంచి సెల్యూలర్ సేవలు ప్రారంభించాం. ప్రస్తుతానికి ఈ సదుపాయం వొడాఫోన్ పోస్ట్‌పెయిడ్ వినియోగదారులకే అందుబాటులోకి తెచ్చాం. మరికొన్ని రోజుల్లో మరిన్ని సర్కిళ్లకు పెంచుతాం. "
- వొడాఫోన్ ఐడియా
ఈ రోజుల్లో వినియోగదారులు అనుసంధాన ఉత్పత్తులపై ఆసక్తి చూపిస్తున్నారు. సెల్యూలర్ సపోర్ట్ ద్వారా ఐఫోన్లో ఉపయోగిస్తున్న నంబరునే యాపిల్ వాచ్‌లో వాడుకోవచ్చని వొడాఫోన్ ఐడియా మార్కెటింగ్ డైరెక్టర్ అన్వేష్ ఖోస్లా తెలిపారు. దీని ద్వారా యాపిల్ వాచ్‌ను స్వతంత్రంగా వినియోగించవచ్చని వెల్లడించారు.