ETV Bharat / business

నష్టాల్లో వొడా-ఐడియా ఆల్​టైమ్​ రికార్డ్​

ప్రముఖ టెలికాం సంస్థ వొడాఫోన్ ఐడియా 2019-20 ఆర్థిక సంవత్సరంలో రూ.73,878 కోట్ల నష్టాన్ని నమోదు చేసింది. దేశీయ సంస్థల్లో ఇప్పటి వరకు ఈ స్థాయిలో నష్టాన్ని నమోదు చేసిన సంస్థ ఇదే కావడం గమనార్హం.

vodafone idea lose
వొడాఫోన్ ఐడియా రికార్డు స్థాయి నష్టం
author img

By

Published : Jul 1, 2020, 1:49 PM IST

గత ఆర్థిక సంవత్సరం (2019-20) టెలికాం సంస్థ వొడాఫోన్-ఐడియా రికార్డు స్థాయి నష్టాలను మూటగట్టుకుంది. 2019-20లో సంస్థ మొత్తం నష్టాలు రూ.73,878 కోట్లుగా ప్రకటించింది. భారతీయ కంపెనీల్లో ఇది వరకు ఏ కంపెనీ ఈ స్థాయి నష్టాలను నమోదు చేయలేదు.

2018-19 ఆర్థిక సంవత్సరంలోనూ ఈ సంస్థ రూ.14,603.9 కోట్లు నష్టాన్ని ప్రకటించింది.

టెలికామేతర ఆదాయాన్నీ.. చట్టబద్ధమైన చెల్లింపుల్లో చేర్చాలని సుప్రీం కోర్టు ఆదేశించిన నేపథ్యంలో.. సంస్థ రూ.51,400 కోట్లు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇది కంపెనీలపై మరింత భారాన్ని పెంచినట్లు వొడాఫోన్​-ఐడియా పేర్కొంది.

భారీ నష్టాలు..

2019-20 చివరి త్రైమాసికం (జనవరి-మార్చి)లో వొడాఫోన్-ఐడియా నికర నష్టం రూ.11,643.5 కోట్లుగా ఉంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం ఇదే సమయంలో సంస్థ నికర నష్టం రూ.4,881.9 కోట్లుగా ఉంది. గత ఆర్థిక సంవత్సరం అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలోనూ రూ.6,438.8 కోట్ల నష్టాన్ని మూటగట్టుకుంది.

ఏజీఆర్ వివాదం..

సవరించిన స్థూల ఆదాయం (ఏజీఆర్​) బకాయిలు కింద 2016-17 ఆర్థిక సంవత్సరానికిగాను వొడాఫోన్​-ఐడియా రూ.58,254 కోట్లు చెల్లించాలని టెలికాం విభాగం (డాట్) లెక్కగట్టింది. అయితే దీనిపై కంపెనీ వాదన మరోలా ఉంది. తమ ఏజీఆర్​ బకాయి రూ.46 వేల కోట్లేనని డాట్​తో వాదిస్తోంది. ఇప్పటికే రూ.6,854.4 కోట్లు చెల్లించింది.

మెరుగైన సేవలందిస్తాం..

కంపెనీ భారీ నష్టాలు నమోదు చేసినప్పటికీ.. తమ వినియోగదారులకు మెరుగైన సేవలు అందించేందుకు తాము కృషి చేస్తున్నట్లు వొడాఫోన్​-ఐడియా సీఈఓ రవీందర్​ తెలిపారు. వేగవంతమైన ఇంటర్నెట్​ కోసం 4జీ సామర్థ్యం పెంపు, విస్తరణ పనులు చేపట్టనున్నట్లు వెల్లడించారు. అయితే సంస్థ నిలదొక్కుకునేందుకు ప్రభుత్వం నుంచి ఉపశమనం కోసం ఎదురుచూస్తున్నట్లు తెలిపారు.

ఇదీ చూడండి:మళ్లీ రూ.90 వేల కోట్లు దాటిన జీఎస్​టీ వసూళ్లు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.