ETV Bharat / business

ఫిబ్రవరిలో జియో భళా.. వొడాఫోన్​- ఐడియా డీలా - భారత్​లో మొత్తం ఇంటర్నెట్​ యూజర్ల సంఖ్య

టెలికాం రంగంలో రిలయన్స్ జియో జోరు కొనసాగుతోంది. ఫిబ్రవరిలో జియో మొబైల్ నెట్​వర్క్​ యూజర్ల సంఖ్య 62.57 లక్షలు పెరిగింది. అటు బ్రాడ్​బ్యాండ్​ విభాగంలోనూ 38.37 కోట్ల కనెక్షన్లతో జియో అగ్రస్థానంలో నిలిచింది.

jio users hike
జియోకు పెరిగిన యూజర్లు
author img

By

Published : Jun 30, 2020, 12:48 PM IST

టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో యూజర్ల సంఖ్య మరింత పెరిగింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో 62.57 లక్షల మంది కొత్తగా జియో నెట్​వర్క్​ను ఎంచుకున్నారు. ఇదే సమయానికి మరో టెలికాం సంస్థ వొడాఫోన్​ ఐడియా 34.67 లక్షల మంది వినియోగదారులను కోల్పోయింది. టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ వెల్లడించిన తాజా గణాంకాలు ఈ విషయాన్ని తెలిపాయి.

ఫిబ్రవరి గణాంకాలు ఇలా..

ఫిబ్రవరి నాటికి దేశంలో మొబైల్‌, ల్యాండ్‌ఫోన్‌ చందాదార్ల సంఖ్య 118 కోట్లుగా ఉంది. ఈ ఏడాది జనవరితో పోలిస్తే ఇది 0.32 శాతం అధికం. ఇందులో 2జీ, 3జీ, 4జీ మొబైల్‌ కనెక్షన్ల సంఖ్య 116 కోట్లు. జనవరి కంటే ఇది 0.36 శాతం ఎక్కువ.

కంపెనీ చందాదారుల్లో మార్పుమొత్తం యూజర్లుమార్కెట్ వాటా
జియో+62.57 లక్షలు38.28 కోట్లు 32.99 శాతం
ఎయిర్​టెల్+9.2 లక్షలు 32.90 కోట్లు28.35 శాతం
వొడాఫోన్ఐడియా-34.67 లక్షలు32.55 కోట్లు28.05 శాతం
బీఎస్​ఎన్​ఎల్+4.39 లక్షలు 11.97 కోట్లు10.32 శాతం

బ్రాడ్​బ్యాండ్​ యూజర్ల లెక్కలు..

ఫిబ్రవరి నాటికి దేశంలో మొత్తం 68.1 కోట్ల బ్రాడ్‌బ్యాండ్‌ కనెక్షన్లు ఉన్నాయి. ఈ ఏడాది జనవరితో పోలిస్తే.. బ్రాడ్‌బ్యాండ్‌ కనెక్షన్లు 1.15 శాతం పెరిగాయి.

బ్రాండ్​బ్యాండ్లలోనూ 38.37 కోట్ల కనెక్షన్లతో జియో అగ్రస్థానంలో నిలిచింది. ఎయిర్​టెల్ 14.61 కోట్లు, వొడాఫోన్​ఐడియా 11.83 కోట్లు, బీఎస్​ఎన్​ఎల్​ 2.47 కోట్ల కనెక్షన్లతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

ఇదీ చూడండి:చైనా యాప్​లకు ఇవి ప్రత్యామ్నాయం.. ట్రై చేయండి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.