ETV Bharat / business

విజయ డయాగ్నోస్టిక్​ ఐపీఓ షురూ- వారికి స్పెషల్​ డిస్కౌంట్​!

హైదరాబాద్​కు చెందిన విజయ డయాగ్నోస్టిక్ సెంటర్​ ఐపీఓ (Vijaya Diagnostic Centre IPO) సబ్​స్క్రిప్షన్​ అందుబాటులోకి వచ్చింది. ఐపీఓలో ఈ సంస్థ షేరు ధర ఎంత(Vijaya Diagnostic Centre Share Price)? సంస్థ ఉద్యోగులకు ఐపీఓలో ఎంత డిస్కౌంట్ లభించనుంది? అనే వివరాలు ఇలా ఉన్నాయి.

Vijaya Diagnostic Centre
విజయ డయాగ్నోస్టిక్ సెంటర్
author img

By

Published : Sep 1, 2021, 10:52 AM IST

హైదరాబాద్​ కేంద్రంగా పని చేస్తున్న విజయ డయాగ్నోస్టిక్‌ సెంటర్‌ లిమిటెడ్ ఇనీషియల్​​ పబ్లిక్‌ ఆఫర్‌ (Vijaya Diagnostic Centre IPO) బుధవారం (సెప్టెంబర్​ 1) సబ్​స్క్రిప్షన్​కు అందుబాటులో వచ్చింది. సెప్టెంబర్​ 3న ఐపీఓ ముగియనుంది.

ఐపీఓలో ఒక్కో షేరు ధరను (Vijaya Diagnostic Centre Share Price) రూ. 522-531గా నిర్ణ‌యించింది కంపెనీ. మొత్తం రూ.1,895.14 కోట్లు సమీకరించే లక్ష్యంతో ఈ సంస్థ ఐపీఓకు వచ్చింది. ఐపీఓ ప్రక్రియ పూర్తయిన తర్వాత.. ఈ నెల 14న మార్కెట్లో లిస్టింగ్​కు వచ్చే అవకాశముంది. ఐపీఓలో వారికి కేటాయించిన కోటా కింద.. బిడ్ దాఖలు చేసిన ఉద్యోగులకు (అర్హులకు మాత్రమే) ఒక్కో ఈక్విటీ షేరుపై రూ.52 డిస్కౌంట్​ లభించనుంది.

విజయ డయాగ్నోస్టిక్‌ గురించి..

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, దిల్లీ సహా 13 ప్రాంతాల్లో 80 కేంద్రాల ద్వారా ఈ సంస్థ డయాగ్నోసిస్​ సేవలు అందిస్తోంది. ఐపీఓ ద్వారా ప్రమోటర్‌ డాక్టర్‌ ఎస్‌.సురేంద్రనాథ్‌ రెడ్డి, ఇన్వెస్టర్లు కారాకోరమ్‌ లిమిటెడ్‌, కేదారా క్యాపిటల్‌ ఆల్టర్నేటివ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్‌లు.. 3.56 కోట్ల షేర్లను విక్రయించాలన్నది ప్రతిపాదన. ప్రమోటరు, ఇన్వెస్టర్లు ఈ ఇష్యూ ద్వారా తమ వాటాను 35 శాతం తగ్గించుకోనున్నారు.

2020-21 ఆర్థిక సంవత్సరంలో రూ.84.91 కోట్ల లాభాన్ని ప్రకటించింది ఈ సంస్థ. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో లాభం రూ.62.5 కోట్లుగా ఉంది. ఇదే సమయంలో ఆదాయం రూ.354.18 కోట్ల నుంచి రూ.388.59 కోట్లకు పెరిగింది.

ఇదీ చదవండి: షేరు.. షేరు.. మాకెందుకు రాలేదు?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.