ETV Bharat / business

బీపీసీఎల్​లో ప్రభుత్వ వాటా కొనుగోలుకు వేదాంత ఆసక్తి

ప్రభుత్వ రంగ చమురు దిగ్గజం భారత్ పెట్రోలియం కార్పొరేషన్​ (బీపీసీఎల్​) కొనుగోలుకు ఆసక్తి వ్యక్తీకరణ బిడ్​ దాఖలు చేసింది వేదాంత. ఈ నెల 16న బిడ్ దాఖలుకు గడువు ముగిసిన తర్వాత అధికారికంగా ఈ ప్రకటన విడుదల చేసింది.

Vedanta interest to buy Govt stake in BPCL
బీపీసీఎల్​లో ప్రభుత్వ వాటా కొనుగోలుకు వేదాంత ఆసక్తి
author img

By

Published : Nov 18, 2020, 4:26 PM IST

మైనింగ్ దిగ్గజం వేదాంత.. భారత్ పెట్రోలియం కార్పొరేషన్​ లిమిటెడ్​ (బీపీసీఎల్​)లో ప్రభుత్వ వాటను కొనుగోలుకు ఆసక్తి వ్యక్తీకరణ బిడ్​ దాఖలకు చేసినట్లు ఆధికారికంగా ప్రకటించింది.

ఇప్పటికే ఉన్న చమురు, గ్యాస్ వ్యాపారాలను మరింత విస్తరించేందుకు.. దేశంలోనే రెండో అతిపెద్ద చమురు సంస్థ అయిన బీపీసీఎల్ కొనుగోలు ఉపయోగపడుతుందని భావిస్తోంది వేదాంత.

బీపీసీఎల్​లో 52.98 శాతం ప్రభుత్వ వాటా కొనుగోలుకు ప్రాథమిక ఆసక్తి వ్యక్తీకరణ తెలిపేందుకు తుది గడువు ఈ నెల 16తో ముగిసింది.

బీపీసీఎల్​ కొనుగోలుకు ఆసక్తి వ్యక్తీకరణ చేస్తూ చాలా బిడ్లు వచ్చాయని ప్రభుత్వం వెల్లడించింది. ఏ ఏ సంస్థలు బిడ్లు దాఖలు చేశాయనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు.

ఇదీ చూడండి:'జీవనకాల గరిష్ఠానికి ఫ్లిప్​కార్ట్​, ఫోన్​పే నెలవారీ యూజర్లు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.