ETV Bharat / business

ప్యానెల్ ముందుకు ఒకేరోజు దిగ్గజ కంపెనీల సీఈఓలు - డిజిటల్​ మార్కెట్ దర్యాప్తు

డిజిటల్​ మార్కెట్​కు సంబంధిచిన దర్యాప్తులో భాగంగా టెక్​ దిగ్గజాలు యాపిల్, ఆల్ఫాబెట్, అమెజాన్, ఫేస్​బుక్​ల సీఈఓలను అమెరికా యాంటి ట్రస్ట్ ప్యానెల్ ప్రశ్నించనుంది. ఇందుకోసం ఆయా సంస్థల సీఈఓలు ప్యానెల్ ముందు 27వ తేదీన ఒకేసారి హాజరుకానున్నారు.

antitrust panel hearing
యాంటి ట్రస్​ ప్యానెల్​ ముందుకు దిగ్గజ సంస్థల సీఈఓలు
author img

By

Published : Jul 7, 2020, 6:54 PM IST

యాపిల్ సీఈఓ టిమ్​కుక్, ఫేస్​బుక్ సీఈఓ మార్క్ జుకర్​బర్గ్, ఆల్ఫాబెట్ (గూగుల్ మాతృసంస్థ)సీఈఓ సుందర్​ పిచాయ్, అమెజాన్​ సీఈఓ జెఫ్​ బెజోస్​లు ఈ నెల 27న 'ది యూఎస్​ హౌస్​ ఆఫ్ రిప్రజంటేటివ్స్​ జ్యుడీషియరి' ముందు హాజరుకానున్నారు. యాంటిట్రస్ట్ ప్యానెల్ దర్యాప్తులో భాగంగా వీరిని ప్రశ్నించనున్నారు అధికారులు.

డిజిటల్ మార్కెట్​​కు సంబంధించి సంస్కరణలు, నియంత్రణ పరమైన ప్రతిపాదనలపై పని చేస్తోంది యాంటిట్రస్ట్ ప్యానెల్. ఈ దర్యాప్తులో సీఈఓలు తమ అభిప్రాయాలనూ వెల్లడించనున్నారు.

ఈ నెల 27న యాంటిట్రస్ట్ ప్యానెల్ ముందుకు వీరంత ఒకేసారి హాజరు కానున్నారు. నాలుగు దిగ్గజ సంస్థల అధినేతలు ఒకేసారి హాజరు కావడం ఇదే ప్రథమం. కరోనా నేపథ్యంలో వీరు నేరుగా హాజరవుతారా, వీడియో కాన్ఫరెన్సింగ్​ ద్వారా మాట్లాడతారా అనేది ఇంకా తెలియాల్సి ఉంది.

సమగ్ర దర్యాప్తు..

డిజిటల్ మార్కెట్​ విషయంలో ఈ నాలుగు టెక్​ దిగ్గజాలపై యాంటిట్రస్ట్ సమగ్ర దర్యాప్తు చేయనున్నట్లు జూన్​లోనే జ్యుడీషియరీ ప్యానెల్ ప్రకటించింది.

ఇందులో భాగంగా ఆయా కంపెనీలకు నోటీసులు కూడా పంపింది. ఆ కంపెనీల సీఈఓలు సహకరించాలని నోటీసులో పేర్కొెంది.

ఇదీ చూడండి:జూన్​లో తగ్గిన నిరుద్యోగిత రేటు.. వృద్ధికి సంకేతమా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.