ETV Bharat / business

క్రెడిట్ కార్డ్ హోల్డర్స్​కు అలర్ట్​.. యూజర్ ఛార్జీలు భారీగా పెంపు - ICICI Credit Card PAYMENTS

ICICI Credit Card: మీరు క్రెడిట్​ కార్డు వాడుతున్నారా? అయితే జాగ్రత్తగా ఉండాల్సిందే. ముఖ్యంగా ఐసీఐసీఐ క్రెడిట్​ కార్డు వాడే వారికి మరింత అప్రమత్తత అవసరం. తాజాగా ఈ బ్యాంకు ఛార్జీలను భారీగా పెంచింది. ఫిబ్రవరి 10న అమల్లోకి వచ్చాయి.

penalty for ICICI Bank credit card users

author img

By

Published : Feb 10, 2022, 1:27 PM IST

ICICI Credit Card: ప్రైవేటు రంగానికి చెందిన దిగ్గజ బ్యాంకు ఐసీఐసీఐ.. క్రెడిట్​ కార్డు ఛార్జీలను భారీగా పెంచింది. ఫిబ్రవరి 10న సవరించిన రేట్లు అమల్లోకి వచ్చాయి.

అన్ని కార్డులపై ఇక నుంచి బ్యాంకు.. 2.5 శాతం ట్రాన్సాక్షన్ ఫీజును వసూలు చేయనుంది. క్యాష్​ అడ్వాన్సెస్​కు ఇది వర్తిస్తుంది. కనీస లావాదేవీ ఛార్జీ రూ. 500గా ఉండనుంది.

బ్యాంక్​ లేట్​ పేమెంట్​ ఛార్జీలను కూడా ఐసీఐసీఐ పెంచేసింది. ఐసీఐసీఐ బ్యాంక్​ ఎమరాల్డ్​ క్రెడిట్​ కార్డు మినహా ఇతర క్రెడిట్​ కార్డులు అన్నింటికీ ఇది వర్తిస్తుంది.

క్రెడిట్​ కార్డు బిల్లును బట్టి.. ఈ లేట్​ పేమెంట్​ ఛార్జీలు మారుతూ ఉంటాయి. బిల్లు రూ. 100 లోపు ఉంటే.. ఎలాంటి ఛార్జీ వసూలు చేయదు.

గరిష్ఠ లేట్​ పేమెంట్​ ఛార్జీని రూ. 1200గా నిర్ణయించింది ఐసీఐసీఐ. క్రెడిట్​ కార్డుపై ఔట్​స్టాండింగ్​ అమౌంట్​ రూ. 50 వేలు అంతకన్నా ఎక్కువ ఉంటే.. ఈ ఛార్జీ పడుతుంది.

ICICI Bank credit card new charges

  • కార్డుపై బకాయి రూ. 100 కంటే తక్కువ ఉంటే.. నో ఛార్జీ.
  • రూ. 100-500 వరకు ఉంటే.. రూ. 100 ఛార్జీ పడుతుంది.
  • రూ. 501- 5000 బకాయికి రూ. 500 ఛార్జీ
  • రూ. 10 వేల వరకు ఔట్​స్టాండింగ్​ అమౌంట్​ ఉంటే రూ. 750 ఛార్జీ వసూలు చేయనుంది ఐసీఐసీఐ.
  • రూ. 25 వేలకు 900 రూపాయలు, రూ. 50 వేల బకాయికి 1000 రూపాయల వరకు ఛార్జీ పడుతుంది.
  • రూ. 50 వేలు అంతకన్నా ఎక్కువకు.. రూ. 1200 ఛార్జీ చేయనుంది. ఇదే గరిష్ఠం.

క్రెడిట్ కార్డుపై డ్యూ మొత్తం రూ.50 వేలకు మించి ఉంటే హెచ్‌డీఎఫ్‌సీ, ఎస్​బీఐ రూ.1300, యాక్సిస్ బ్యాంక్ రూ.1000 వరకు ఛార్జీలను వసూలు చేస్తున్నాయి.

చెక్​ ఛార్జీలు కూడా..

ICICI Cheque Return Charges: ఐసీఐసీఐ బ్యాంక్ చెక్ ఛార్జీలను కూడా పెంచింది. చెక్ రిటర్న్ అయితే చెల్లించాల్సిన బకాయి మొత్తంలో 2 శాతం ఛార్జీ పడుతుంది. కనీసం రూ. 500 కోత విధించనుంది.

ఇవీ చూడండి: ఎన్నికల తర్వాత ధరల మోతే- వంట నూనెలు, పెట్రోల్​ పైపైకి!

మళ్లీ టారిఫ్​ పెంపు.. ఎయిర్​టెల్​ కస్టమర్లకు మరింత భారం!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.